ఘోర విషాదం: ఆరుగురు చిన్నారులు సజీవ దహనం

పాట్నా: బీహార్ రాష్ట్రంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోని అరారియా జిల్లా కబైయా గ్రామంలో ఓ పూరింట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడేవున్న ఆరుగురు చిన్నారులు సజీవ దహనమయ్యారు. మొక్క జొన్నలు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పంటుకోవడంతో ఈ ఘోరం జరిగింది.

మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ చిన్నారులు బయటకు రాలేకపోయారు. చిన్నారుల ఆర్తనాదాలు విని స్థానికులు మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ మంటల్లోనే చిన్నారులు కాలిపోయారు. ప్రమాద సమయంలో చిన్నారుల కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లడంతో పిల్లలని కాపాడేందుకు సమయానికి ఎవరూ అందుబాటులో లేకుండా పోయారు.

 Bihar: Six children burnt alive in Araria district

అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా 3 నుంచి ఆరేళ్ల లోపు పిల్లలే. ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్నారుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+