వాద్రాకు షాక్: బికనీర్ ల్యాండ్ స్కాంలో ఇద్దరి అరెస్ట్

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: బికనీర్ భూ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌ డైరెక్టరేట్ ఇద్దరిని శుక్రవారం నాడు అరెస్ట్ చేసింది. జయప్రకాశ్ బగర్వా, అశోక్‌ కుమార్‌లను అరెస్టు చేసింది. వీరిలో అశోక్ కుమార్‌కు స్కైలైట్ హాస్పిటాలిటీ లిమిటెడ్‌కు చెందిన మహేశ్ నాగర్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఈడీ పేర్కొంది. వీరిని మనీ లాండరింగ్ నిరోధక చట్టం క్రింద అరెస్టు చేసినట్లు తెలిపింది. స్కైలైట్ హాస్పిటాలిటీతో రాబర్ట్ వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఆశోక్ ‌కుమార్, మహేశ్ నాగర్ ఇళ్ళలో సోదాలు నిర్వహించింది.వాద్రాకు అనుబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న స్కైలైట్ సంస్థ బికనీర్‌లో భూములను కొనుగోలు చేసిందని, దీనికి సంబంధించి నాలుగు కేసులు నమోదు చేసినట్లు ఈడీ తెలిపింది.

Bikaner land scam case: ED arrests 2 persons allegedly linked to Robert Vadra firm

ఈ కొనుగోళ్ళకు ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్‌గా నాగర్ వ్యవహరించారని తెలిపింది. అదే ప్రాంతంలో భూమిని ఇతరులు రాసిన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా కుమార్ కొన్నట్లు తెలిపింది. నాగర్‌కు కుమార్ అత్యంత సన్నిహితుడని పేర్కొంది.

రాజస్థాన్ రాష్రంలోని బికనీర్‌కు సమీపంలో కొనుగోలు చేసిన భూమిపై ఈడీ విచారణ చేస్తోంది.ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రభుత్వాధికారులు ఇతరులకు చెందిన సుమారు 1.18 కోట్ల ఆస్తులను కూడ సీజ్ చేసింది. పిఎంఎల్ఏ కింద 2015 లో కేసు కూడ నమోదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Enforcement Directorate has arrested 2 persons allegedly involved in the Bikaner Land Scam case. These two men were conduits and also linked to Congress President Rahul Gandhi’s brother-in-law Robert Vadra’s firm.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి