షాకింగ్: బైక్‌పై సింహాలను వెంటాడిన యువకులు, విచారణకు ఆదేశం (వీడియో)

Posted By:
Subscribe to Oneindia Telugu

అహ్మదాబాద్: సింహాలను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ కొందరు యువకులు గుజరాత్‌లో వాటిని వెంబడించారు. ద్విచక్ర వాహనాల మీద వెంటాడే ప్రయత్నం చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో కలకలం రేపుతోంది.

గుజరాత్‌లోని ప్రముఖ గిరి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నలుగురు బైకర్లు సింహాలను వెంటాడుతూ దానిని తమ ఫోన్లలో చిత్రీకరించారు.

బైక్‌తో తన మీదకు వస్తున్న యువకుల నుంచి తప్పించుకునేందుకు రెండు సింహాలు అడవిలోకి పారిపోయాయి. అమ్రేలి జిల్లాలోని అడవిలో దీనిని చిత్రీకరించినట్లుగా భావిస్తున్నారు.

ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో ఈ వీడియో హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో గుజరాత్ అటవీ శాఖ దీనిపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వీడియోలో ఒక బైక్ నెంబర్ కనిపిస్తుండటంతో ఆ వివరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A video that shows a group of bikers chasing lions in Gujarat's Gir sanctuary has gone viral -and launched a search for the four men. They are seen chasing lions, lionesses and cubs. The license plate for one of the bikes can be seen. The lions run frantically to escape the interlopers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి