ఏడాదికోసారైనా భారత్‌కు: దేశ నాయకుడే ఇలా అంటూ మోడీపై బిల్ గేట్స్ ప్రశంసలు

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతదేశం, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ ప్రశంసల వర్షం కురిపించారు. తాను 'కనీసం ఏడాదికి ఒకసారైనా భారత్‌కు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా' అంటూ ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.

గత సంవత్సరం ఆయన భారత్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్ తన అనుభవాలను ట్విటర్లో పంచుకున్నారు.

ఏడాదికోసారైనా..

ఏడాదికోసారైనా..

‘ఏడాదికోసారైనా భారత్‌కు రావాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఓ కొత్త విషయం నుంచి స్ఫూర్తి పొందుతున్నా' అని గేట్స్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌ పర్యటన సందర్భంగా ఇండియాగేట్‌ వద్ద ఆటోలో ప్రయాణించిన ఫొటోను కూడా గేట్స్‌ పోస్టు చేశారు.

మోడీపై ప్రశంసలు

మోడీపై ప్రశంసలు

అంతేగాక, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు బిల్‌గేట్స్‌. ప్రధాని మోడీపై ఇటీవల తన బ్లాగులో రాసిన పోస్టు లింక్‌ను గేట్స్‌ షేర్‌ చేశారు. ప్రధాని మోడీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్‌ ఎంతగానో స్ఫూర్తినిస్తోందని గేట్స్‌ చెప్పుకొచ్చారు.

అనాటి మోడీ ప్రసంగం

అనాటి మోడీ ప్రసంగం

ఈ సందర్భంగా 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ తొలిసారిగా స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగాన్ని గుర్తుచేసుకున్నారు. ‘మోడీ స్వచ్ఛభారత్‌ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మహిళలకు కనీస సౌకర్యాలు లేవు. వారు బహిర్భూమికి వెళ్లాలంటే చీకటిపడేవరకు ఆగుతారు. అది వారి ఆరోగ్యానికి ఎంత నష్టం కలిగిస్తుందో తెలుసా? మన తల్లులు, సోదరీమణుల ఆత్మగౌరవాన్ని మనం కాపాడలేమా. వారికి టాయిలెట్స్‌ కట్టించలేమా? అని మోదీ ప్రశ్నించారు' అని గేట్స్ గుర్తు చేసుకున్నారు.

దేశ నాయకుడే ముందుండి

దేశ నాయకుడే ముందుండి

మహిళలకు సంబంధించి ఈ సున్నితమైన అంశాన్ని ఓ దేశ నాయకుడు అంత స్పష్టంగా, బహిరంగంగా చెబుతాడని తాను ఊహించలేన్నారు బిల్ గేట్స్. కానీ మోడీ చెప్పగలిగారన్నారు. స్వచ్ఛభారత్‌ గురించి ఇంకో ఆనందకరమైన విషయమేంటంటే.. దేశంలోని ఓ పెద్ద సమస్యను గుర్తించడమేగాక, దాని కోసం అందరూ సమిష్టిగా పనిచేస్తున్నారు' అని గేట్స్‌ ప్రశంసించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The world's richest man, Bill Gates, was recently in India and has posted several videos and pictures from his visit. His most recent share from his time in India is a picture of him riding in an auto around India Gate. However, what's even more wonderful than the picture itself is the Microsoft co-founder's tweet accompanying it. "I try to visit India at least once a year.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి