Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Yashasvi Jaiswal: పానీ పూరి నుంచి స్టార్ క్రికెటర్ వరకు.. ఇది యశస్వి జైస్వాల్ చరిత్ర..

మనిషిని కష్టాలు మరింత ముందుకు నడిపిస్తాయి. కష్టాలు మనిషిలో కసిని పెంచుతాయి. ఎదగాలనే కోరికకు బీజం వేస్తాయి. ఇలా కష్టాలను ఎదుర్కొని ఎంతో మంది పైకి వచ్చారు. అలాంటి వారిలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఒకడు. ఒక్కప్పుడు పానీ పూరి అమ్మిన అతను ఇప్పుడు పరుగుల వీరుడయ్యాడు. ఉత్తరప్రదేశ్ లోని సూర్యవాన్ అనే చిన్న గ్రామంలో ఉపేంద్ర జైస్వాల్ చిన్న దుకాణం నడుపుకునే వారు. ఆయన భార్య కంచన్ జైస్వాల్ హౌస్ వైఫ్. వీరి నాల్గో సంతానమే యశస్వి జైస్వాల్.

యశస్వి జైస్వాల్ 2001 డిసెంబర్ 28న జన్మించారు. యశస్వికి ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు. దీంతో వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేది. అయితే యశస్వికి ఊహ తెలిసిన నుంచి క్రికెట్ అంటే ప్రాణం.. అతను స్కూల్ అయిపోగానే గ్రౌండ్ కు వెళ్లి క్రికెట్ ఆడేవాడు. అయితే అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ముంబై వెళ్లాలని యశస్వి నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట వారు ఒప్పులేదు. కానీ 11 ఏళ్ల జైస్వాల్ పట్టుదల చూసిన తండ్రి యశస్విని ముంబైకి పంపాలని నిర్ణయించుకున్నాడు.

 Yashasvi Jaiswal

ఉపేంద్ర జైస్వాల్ ముంబైలోని తన తమ్ముడికి దగ్గరికి జైస్వాల్ ను పంపించాడు. అయితే ముంబైలో జైస్వాల్ బాబాయ్ ఓ పూరి గుడెసేలో ఉండేవాడు. జైస్వాల్ ఉండేందుకు చోటు కూడా ఉండేది కాదు. దీంతో జైస్వాల్ ను వాళ్ల బాబాయ్ ఓ డెయిరీలో పనికి పెట్టాడు. అక్కడ జైస్వాల్ ఉదయం పని చేసుకుంటూ.. సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఒక రోజు డెయిరీ ఓనర్ జైస్వాల్ ను బయటకు పంపించేశాడు. దీంతో యశస్వి ఆజాదీ మైదానానికి చేరుకున్నాడు.

అక్కడ ఓ వ్యక్తి ఓ చిన్న గూడారంలో జైస్వాల్ కు నివాసం కల్పించారు. అలా అక్కడ ఉంటూ సాయంత్రం పానీ పూరి అమ్మి ఉదయం ప్రాక్టీస్ చేసేవాడు. అయితే జ్వాలా సింగ్ అనే క్రికెట్ కోచ్ యశస్వి ప్రతిభను చూసి చేరదీశాడు. జ్వాలా సింగ్ యశస్వి జీవితంలో దేవదూతలా వచ్చారు. అతను జైస్వాల్ బాధ్యతను తీసుకున్నాడు. అతనికి ఉండడానికి ఒక స్థలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత యశస్వి ముంబై U-16 జట్టుకు ఎంపికయ్యాడు.

 Yashasvi Jaiswal

2018 U-19 ఆసియా కప్ అతని జీవితాన్ని మలుపు తిప్పింది. యశస్వి ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 318 పరుగులు చేసి భారత్‌ను విజయపథంలో నడిపించాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచాడు. 2019న చత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసి సత్తా చాటాడు.

2020 IPL వేలంలో యశస్వి జైస్వాల్ అన్‌క్యాప్డ్ జాబితాలోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ ను రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం నమోదు చేశాడు. యశస్వి జైస్వాల్ భారత జట్టులో కూడా చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+