Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్ థాక్రే బర్త్ డే గిఫ్ట్: పెట్రోల్‌పై రూ.4-9 తగ్గింపు, బంకుల వద్ద వాహనదారుల బారులు

ముంబై: పెరిగిన పెట్రోల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధినేత రాజ్ థాక్రే పుట్టిన రోజు రావడం వాహనదారుల్లో సంతోషాన్ని నింపింది.

అదేలాగంటారా.. రాజ్ థాక్రే తన పుట్టిన రోజు సందర్భంగా ముంబై మహానాగరంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో ప్రస్తుత లీటర్ పెట్రోల్ ధర కంటే రూ.4 నుంచి రూ.9తగ్గించి ద్విచక్ర వాహనదారులకు అందించారు. దీంతో ఆయా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు.

Birthday Boy Raj Thackerays Gift To Maharashtra - Fuel Upto R

పెట్రోల్ బంకుల వద్ద మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) నేతలు, కార్యకర్తలు దగ్గరుండి ఈ ఏర్పాట్లను చూస్తున్నారు. ధర తగ్గించి అమ్మిన పెట్రోల్ బంకులకు ఎంఎన్ఎస్ పార్టీ ఆ మొత్తాన్ని చెల్లిస్తోంది.

ఈ సందర్భంగా ఎంఎన్ఎస్ పార్టీ కార్యకర్త మాట్లాడుతూ.. గురువారం ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల్లో ద్విచక్ర వాహనదారులకు విక్రయించే పెట్రోల్‌పై ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపారు.

ముంబైలోని శివాడి అసెంబ్లీ నియోజకవర్గంలో లీటర్‌పై రూ.9తగ్గించినట్లు చెప్పారు.
పెట్రోల్ ధరలు భారీ మొత్తంలో తగ్గించి అందించడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ కూడా ఈ మేరకు పెట్రోల్ తగ్గిస్తే బాగుంటుందని కొందరు పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+