Birthday party: బర్త్ డే పార్టీలో బిర్యానీ తిని భార్య ప్రాణం పోయింది, షాకింగ్ నిర్ణయం తీసుకున్న భర్త !
చెన్నై: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతుకు పెళ్లి వయసుకు వచ్చిన ఓ కూతురు ఉంది. 22 ఏళ్ల నుంచి దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. బంధువుల ఇంట్లో బర్త్ డే పార్టీ ఉండటంతో దంపతులు వెళ్లాలని అనుకున్నారు. అయితే తనకు పని ఉందని నువ్వు వెళ్లి రావాలని భర్త అతని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. బర్త్ డే పార్టీలో బంధువులు, స్నేహితులకు బిర్యానీ వడ్డించారు. బిర్యానీ తిన్న భార్య ఆమె బంధువులతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెలుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. బిర్యానీ తిన్న భార్య ప్రాణం పోయింది. భార్య చనిపోయిందనే ఆవేదనతో భర్త కూడా ఊహించిన నిర్ణయం తీసుకోవడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

దంపతుల హ్యాపీలైఫ్
చెన్నై సిటీలోని ఆయనవరంలోని మోట్టూట్ వీధిలో తంబుస్వామి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 23 సంవత్సరాల క్రితం తంబుస్వామి భవాని అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తంబుస్వామి, భవాని దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. తంబుస్వామి, భవాని దంపతుకు పెళ్లి వయసుకు వచ్చిన యువశ్రీ (22) అనే కూతురు ఉంది.

భార్య, కూతురు అంటే ప్రాణం
23 ఏళ్ల నుంచి తంబుస్వామి, భవాని దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. భార్య భవాని, కూతురు యువశ్రీ అంటే తంబుస్వామికి ప్రాణం. పబ్లర్ కాంట్రాక్టర్ గా పని చేస్తున్న తంబుస్వామి డబ్బులు బాగా సంపాధించి అతని భార్య భవాని, కూతురు యుశ్రీని చాలా బాగా చూసుకుంటున్నాడు.

బంధువుల ఇంట్లో బర్త్ డే పార్టీ
అయనవరంలోని మొట్టూ వీధిలోనే నివాసం ఉంటున్న బందువుల ఇంట్లో బర్త్ డే పార్టీ ఉంది. బయటకు వెళ్లిన తంబుస్వామి తాను త్వరగా వస్తానని, బర్త్ డే పార్టీకి వెలుదామని భార్య భవానికి చెప్పాడు. బయటకు వెళ్లిన తంబుస్వామికి పనిపూర్తి కాలేదు. తనకు పని ఉందని నువ్వు బర్త్ డే పార్టీకి వెళ్లి రావాలని తంబుస్వామి అతని భార్య భవానికి ఫోన్ చేసి చెప్పాడు.

బిర్యానీ తిన్న భార్య ప్రాణం పోయింది
బర్త్ డే పార్టీలో బంధువులు, స్నేహితులకు బిర్యానీ వడ్డించారు. భవానీ కూడా కడుపునిండా బిర్యానీ తినింది. బర్త్ డే పార్టీ ముగించుకున్న భవాని ఆమె బంధువులతో కలిసి ఇంటికి నడుచుకుంటూ వెలుతూ రోడ్డు పక్కన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే భవానీని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే భవానీ ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు.

ఆర్తనాదాలు చేసిన భర్త
భవానీని ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుసుకున్న ఆమె భర్త తంబుస్వామి, కూతురు యువశ్రీ ఆసుపత్రికి పరుగు తీశారు. అయితే అప్పటికే భార్య భవానీ చనిపోయిందని తెసుకున్న తంబుస్వామి ఆర్తనాదాలు చేశాడు. ఆసుపత్రిలో తంబుస్వామి కనపడకుండా పోయాడు. కూతురు యువశ్రీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా తంబుస్వామి ఫోన్ రిసీవ్ చెయ్యలేదు.

భార్య లేని జీవితం వద్దని భర్త ఆత్మహత్య
భవాన్ని శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. అప్పటికే వంట గదిలో తంబుస్వామి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని శవమై కనిపించడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. భార్య భవానీ లేని జీవితం వద్దనుకున్న తంబుస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు చలించిపోయారు. భవాని బిర్యానీ తిని చనిపోయిందా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా ? అని ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications