ఖజానా ఖాళీ చేసి ఢిల్లీలో సీఎం డ్రామాలు, న్యాయం చేసిన మోదీ, అన్యాయం చేసింది !
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని పోల్చితే ఇంత వరకు ఎవ్వరూ ఇలాంటి అభివృద్ధి పనులు చెయ్యలేదని, గ్రాంట్లు విడుదల చేసే సమయంలో కూడా మోదీ తారతమ్యం చూపించలేదని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర అన్నారు. కర్ణాటక మీద మోదీ వివక్ష చూపిస్తున్నారని సీఎం సిద్దరామయ్య ఆరోపించడం విడ్డూరంగా ఉందని విజయేంద్ర అన్నారు.
కర్ణాటకకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం నుండి న్యాయం జరిగిందని కన్నడిగులు అందరికి తెలుసని, కర్ణాటక ఖజానాను ఖాళీ చేస్తున్న సీఎం సిద్దరామయ్య అండ్ కో ఇప్పుడు ఛలో ఢిల్లీ కార్యక్రమం ఏర్పాటు చేసి కన్నడిగులను మోసం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని, ఛలో ఢిల్లీ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకుల డ్రామాలా తయారు అయ్యిందని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు విజయేంద్ర మండిపడ్డారు.

సీఎం సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కపటనాటకాలు ఆడటానికి ఢిల్లీకి వెళ్లారని, యూపీఏ ప్రభుత్వంలో కర్ణాటకకు ఎంత నిధులు వచ్చాయి, ఎన్ డీఏ హయామంలో కర్ణాటకకు ఎంత నిధులు వచ్చాయి అని సీఎం సిద్దరామయ్య బహిరంగంగా ప్రజలకు లెక్కలు చెప్పాలని బీజేపీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు విజయేంద్ర సవాలు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటకకు పూర్తి అన్యాయం జరిగిందని, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక కనీస వసతులులేని కర్ణాటకకు న్యాయం జరిగిందని విజయేంద్ర అన్నారు.
జలజీవన్ మిషన్ కనెక్టివిటీ, విమానాశ్రయాలు, మెట్రో కనెక్టివిటీ, రైల్వే ఇలా ప్రతి శాఖలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కర్ణాటకలో విప్లవాత్మక పథకాలు అమలు చేసిందని విజయేంద్ర అన్నారు. విద్యుద్దీకరణ. రాష్ట్ర కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో పూర్తిగా విఫలమైన కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజావ్యతిరేక, రైతు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, అవినీతికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక ప్రజలకు న్యాయం చెయ్యడం లేదని విజయేంద్ర ఆరోపించారు.

కర్ణాటక ఖజానా ఖాళీ చేసిన తరువాత ఇప్పుడు విధానసౌధను ఖాళీ చేసి ఛలో ఢిల్లీ డ్రామాలు ఆడుతున్న సిద్దరామయ్య ప్రభుత్వం కర్ణాటక ప్రజల చెవిలో పూలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నదని విజయేంద్ర ఆరోపించారు. విధానసౌధలోని ముఖ్యమంత్రి కార్యాలయానికి తాళం వేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దరామయ్య ప్రభుత్వం ప్రజలకు న్యాయం చెయ్యడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు బుధవారం బెంగళూరు నగరంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంతో పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
స్టార్ హీరోకు గుడి కట్టిన డై హార్డ్ ఫ్యాన్.. ఎక్కడంటే ?? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్












Click it and Unblock the Notifications