రసవత్తర రాజకీయాలు, కాబోయే రాజు ఎవరు, రాణికి మరో చాన్స్ ?, జైపూర్ లో జెండా ఎవరిది !
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనుండగా ఆరాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిసింది. కాంగ్రెస్, బీజేపీలకు సమంగా సీట్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో రెండు పార్టీల నాయకులు ఎవరి ప్రయత్నాలు వాళ్లు చేసుకుంటున్నారని స్థానిక మీడియా అంటోంది.
రాజస్థాన్ లో ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు అనేక ప్లాన్ లు వేస్తున్ననాయి. రెండు జాతీయ పార్టీలు పార్టీలకతీతంగా చిన్న పార్టీల మద్దతు కోరుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడగానే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి దాదాపు 40 మంది అభ్యర్థులకు టిక్కెట్లు నిరాకరించారు. అయితే చాలా మంది నాయకులు తిరుగుబాటు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి టికెట్లు పొందిన అభ్యర్థులకు రెబల్స్ గట్టి పోటీ ఇచ్చారు.

అనేక ఎగ్జిట్ పోల్స్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉందని, ఇరు పార్టీలు ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు కోరే అవకాశం ఉందని అంచనా వేశాయి. రాజస్థానలో ప్రభుత్వ ఏర్పాటులో తిరుగుబాటు శాసనసభ్యులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే గెలిచిన స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు, తిరుగుబాటు అభ్యర్థులను లాక్కోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయని వెలుగు చూసింది.

ఇదే విషయంలో వివిధ స్థాయిల్లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని ఇరు పార్టీల వర్గాలు తెలిపాయి. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కలిశారు. మరుసటి రోజు అంటే శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా గవర్నర్‌ను కలిశారు. చాలా సర్వేలు బీజేపీకి మెజారిటీ వస్తాయని అంచనా వేయగా, మూడు ఎగ్జిట్ పోల్స్ రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసింది.
ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ లు పార్టీలకతీతంగా రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునేందుకు సిద్దం అవుతున్నాయని రాజస్థాన్ లోని మీడియా అంటోంది. మా పార్టీ నేతలు ఇప్పటికే స్వతంత్రులు, రెబల్స్‌తో టచ్‌లో ఉన్నారని, మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కాంగ్రెస్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి.

ఈ వ్యూహాన్ని అనుసరించి.. టిక్కెట్లు దక్కకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రెబల్స్‌తో నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తిరుగుబాటు ఉన్నప్పటికీ, అవసరమైతే చిన్న పార్టీలతో ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకునే అవకాశాలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు పరిశీలిస్తున్నారు. మొత్తం మీద స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తారా, కాంగ్రెస్ వైపు చూస్తారా అంటూ రాజస్థాన్ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications