కర్ణాటకలో ఏ కులానికి ఎన్నిసీట్లు ఇచ్చారంటే ?, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీ సీట్లు వీళ్లకే ఎక్కువ !
కర్ణాటకలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్నికలకు గాను కాంగ్రెస్ 24 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అలాగే బీజేపీ 20 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్, బీజేపీలు చాలా నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నో లెక్కలు వేసుకుని తమ అభ్యర్థులను ప్రకటించాయి.
అందులో కులాల లెక్క కూడా ముఖ్యంగా ఉన్నాయి. కర్ణాటకలో లింగాయత్‌లు, ఒక్కలిగుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే, బీజేపీ ప్రకటించిన జాబితాలో లింగాయత్ సామాజికవర్గానికి సింహభాగం, ఒక్కలిగాల్లో ఇద్దరికి సీట్లు వచ్చినా బీజేపీ హైకమాండ్ కురుబ సామాజికవర్గాన్ని విస్మరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఎక్కువ లోక్ సభ సీట్లు కైవసం చేసుకోవాలని అనుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని లెక్కలు వేసుకుని ఎంపీ సీట్లు కేటాయించాని వెలుగు చూసింది.

కర్ణాటక రాష్ట్రంలో అత్యంత ఆధిపత్యం దక్కించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏయే కులాలకు ప్రాధాన్యత ఎంపీ టిక్కెట్లు ఇచ్చాయి, కులాల వారీగా అభ్యర్థుల ఎంపిక ఇలా అన్నీ ఇప్పుడు ప్రజలు లెక్కపెడుతున్నారు. 6 మంది ఒక్కలిగులు, 5 మంది లింగాయత్ లు, ముగ్గురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలు, ఇద్దరు కురుబ కులస్తులతో పాటు మొత్తం 24 లోక్ సభ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించింది.
ఈడిగ, బిల్లవ, బంట, రెడ్డి, ముస్లీం, మరాఠా వర్గాలకు ఒక్కో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చింది. అలాగే బీజేపీ ఇప్పటి వరకు 20 లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది, అందులో 8 మంది లింగాయత్‌లు, ముగ్గురు ఒక్కలిగులు, ఇద్దరు ఎస్సీలు, ఇద్దరు బ్రాహ్మణులతో పాటు క్షత్రియ, బంజారా, వాల్మీకి నాయక్, బంట, బిల్లవ సామాజిక వర్గాలకు టికెట్లు ఇచ్చింది.
కులాల వారీగా కాంగ్రెస్ అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో అన్ని కులాల వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక్కలిగులకు, బీజేపీ లింగాయత్ లకు ఎక్కువ ప్రధాన్యత ఇచ్చిందని వెలుగు చూసింది. ఇక జేడీఎస్ కు మూడు ఎంపీ సీట్లు ఇచ్చింది. అందులో రెండు సీట్లలో దేవేగౌడ కుటుంబ సభ్కులు పోటీ చేస్తున్నారు. మరో సీటు ఎవరికి ఇస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications