మోదీ vs సోనియా గాంధీ, ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎవరికి ?, సండే సెమీఫైనల్స్ లో సైలెంట్ అయ్యేది ఎవరు ?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ కు కొన్ని గంటల్లో తెరపడిపోతుంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల ఫలితాల విషయంలో ఎవరి లెక్కలు వాళ్లు వేసుకుంటున్న రాజకీయ నాయకులు గురువారం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విషయంలో ఎవరికి తోచినట్లు వాళ్లు అంచనాలు వేసుకుంటున్నారు. ఇప్పటికే గెలుపు ధీమాపై భుజాలు గుద్దుకుంటున్న నాయకుల విషయంలో ఓటర్లు ఎవరికి తలరాత మారుస్తున్నారో అని కచ్చితంగా తేలిపోవడానికి ఆదివారం వరకు టైమ్ ఉంది.
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలంగాణ మినహా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య గట్టిపోటీ ఉంది. వార్ వన్ సైడ్ అనే లెవల్లో మాత్రం ఎన్నికలు జరగలేదు. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కు బీజేపీ గట్టిపోటీ ఇస్తూనే వచ్చాయి.

అయితే తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇవ్వడానికి కాంగ్రెస్ అనేక ప్రయత్నాలు చేసింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పుణ్యమా అంటూ కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉచితహామీల జల్లు కురిపించడంతో ఆ పార్టీ ఊపందుకుంది. ఇక తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీల ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు
అయితే కారు జోరు తగ్గదని, కారు టాప్ గేర్ లో వెలుతోందని గురువారం మద్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఆ రాష్ట్ర ఐటీ బీటీ శాఖా మంత్రి కేటీఆర్ ట్వీట్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తరువాత 10 ఏళ్లు ప్రజలకు చేసిన మంచి పనులే మమ్మల్ని గెలిపిస్తాయని, ఢిల్లీ నుంచి వచ్చి ఉచిత హామీలు ఇచ్చి మళ్లీ విమానంలో ఢిల్లీ వెళ్లిపోయే నాయకుల ఉచిత హామీలను ప్రజలను నమ్మరని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు.
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపు మాదే అని అంటున్నారు. ఇక మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో విజయం మాదే అని ఎవరిపాటికి వాళ్లు చెబుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లో విజయం మాదే అంటూ గురువారం మద్యాహ్నం మీడియా ముందుకు వచ్చి ధీమా వ్యక్తం చేసింది. అయితే నాయకుల తలరాతలు మార్చే ఓటరు నాడి తెలుసుకోవడం బ్యాటెల్ బాక్సులకు తప్పా నాయకులకు లేదని త్వరలో తెలుస్తోంది.

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సెమీఫైనల్స్ గా మారాయి. ఐదు రాష్ట్రాల ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎవరికి ? అనే విషయం ఆదివారం తెలిసిపోతుంది. కర్ణాటకలో లాగా ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు వస్తే మాత్రం బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
కర్ణాటకలో చేసిన తప్పు మరోసారి రిపీట్ కాకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంది. అయితే ఇప్పటికే అంతా అయిపోవడంతో ఇక కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆదివారం టీవీల ముందు కుర్చుని మీకు ఎన్ని, మాకు ఎన్ని అని లెక్క పెట్టుకోవడం తప్పా ఇక చేసేది ఏమీ లేదని ఓటర్లు అంటున్నారు. మొత్తం మీద ఆదివారం ఫైవ్ స్టార్ చాక్లెట్ ఎవరికి అనే విషయంలో వందకు వంద శాతం క్లారిటీ వచ్చేస్తుంది.
-
కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్.. రామయ్య ఆశీస్సులతో.. -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications