మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !

బీజేపీ, జేడీఎస్ పార్టీలు ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు సిద్ధమయ్యాయని, మైసూరు నుంచి మేం ఒక్కటయ్యామని సందేశం పంపిస్తున్నామని రెండు పార్టీల నాయకులు అన్నారు. పాత మైసూరు ప్రాంతంలో జేడీఎస్ బలంగా ఉందని, ఈ ప్రాంతం నుంచి ఐక్యత చాటుకుంటే భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందని బీజేపీ, జేడీఎస్ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

గతంలో అంటే 2019లో జేడీఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. జేడీఎస్ చేసిన తప్పు ఈసారి కూడా జరగకుండా జాగ్రత్త పడుతోంది. ఇదిలా ఉండగా లోక్ సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో బీజేపీ, జేడీఎస్ నేతల మధ్య ఎలాంటి విబేధాలకు తావు లేకుండా తదుపరి వ్యూహం రచించేందుకు రెండు పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. నామినేషన్ పత్రాల సమర్పణ నుండి లోక్ సభ ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పని చేస్తామని అన్నారు.

BJP and JDS alliance leaders have vowed not to sleep until Modi becomes Prime Minister

బీజేపీ, జేడీఎస్ పార్టీల కర్ణాటక శాఖల అధ్యక్షులు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్గీ తీరును ఎండగట్టి బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం కసరత్తు ప్రారంభించారు. మైసూరులో మైత్రి పార్టీ సీనియ్ నాయకుడు, జేడీఎస్ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ పార్టీల కూటమి బలంగా ఉందని, ఇక ముందుకూడా అలాగే కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం కోసం అందరం కలిసి పని చేస్తామనే సందేశాన్ని అందించే పనిలో రెండు పార్టీల నాయకులు చెప్పారు.

BJP and JDS alliance leaders have vowed not to sleep until Modi becomes Prime Minister

మైసూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన బీజేపీ, జేడీఎస్ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలు, నగర, జిల్లా నేతల కూటమి సమావేశంలో జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర పాల్గొని వ్యూహం రచించారు. మాకు మన దేశ భద్రత ముఖ్యమని మహాకూటమి సమావేశంలో నేతలు చాలా మంది అన్నారు. బీజేపీ-జేడీఎస్‌ కార్యకర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ లోక్ సభ ఎన్నికల కోసం పని చేస్తున్నారని అన్నారు.

వివిధ దేశాల్లో మతపరమైన అల్లర్లు పెరిగాయి. కానీ, మైనారిటీలు కూడా సుఖంగా ఉండే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే. అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితీరు కారణం అని నాయకులు అన్నారు. బీజేపీలో చేరిన జేడీఎస్ మునిగిపోయిందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, లోక్ సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ మునిగిపోవడం కాయం అని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి అన్నారు.

BJP and JDS alliance leaders have vowed not to sleep until Modi becomes Prime Minister

బీజేపీ, జేడీఎస్ కూటమి మైసూరు ఎంపీ అభ్యర్థి యదువీర్ ను గెలిపించడానికి అందరం కలిసికట్టుగా పని చేయాలని, అందుకోసం మేము ప్రత్యేక బృందాన్ని నియమించాలని అనుకుంటున్నామని, అందరూ కలిసి యదువీర్ ను భారీ మెజారిటీతో ఎంపీగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో బీజేపీ, జేడీఎస్ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు చాలా మంది మాట్లాడారు. అందరూ మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+