కాంగ్‌కు పరాభవం: 3 బిజెపివే, ఢిల్లీలో కేజ్రీవాల్ హవా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ప్రీ ఫైనల్స్‌గా భావిస్తున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోయింది! దేశ రాజధానిలో కొత్తగా పుట్టుకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రెండు పార్టీలకు షాక్ ఇచ్చింది.
మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ నేతృత్వంలో బిజెపి అధికారాన్ని నిలబెట్టుకోగా, రాజస్థాన్‌లో వసుంధరా రాజే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని మట్టికరిపించింది. ఢిల్లీలో బిజెపి గెలుపు అవకాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బ కొట్టింది. అయినప్పటికీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఛత్తీస్‌గఢ్‌లోను రమణ్ సింగ్ నేతృత్వంలో బిజెపి స్వల్ప ఆధిక్యంతో మరోసారి విజయం సాధించింది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ ఫలితాలు బిజెపిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగా, కాంగ్రెసులో నిస్తేజాన్ని నింపాయి. ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన షీలా దీక్షీత్‌ను ఎఎపి అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 22 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. గత మూడు పర్యాయాలు అధికారంలో ఉన్న కాంగ్రెసు కేవలం సింగిల్ డిపాజిట్‌కు పడిపోవడం గమనార్హం. ఢిల్లీలో బిజెపి 33, ఎఎపి 28, కాంగ్రెసు 8, ఇతరులు 2 స్థానాలతో ఉన్నారు.
మధ్యప్రదేశ్‌లో వ్యతిరేక ఓటుపై కాంగ్రెసు పార్టీ నమ్మకం పెట్టుకున్నా శివరాజ్ సింగ్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఆయన పట్ల ప్రజలకు ఉన్న అభిమానానికి తోడు నరేంద్ర మోడీ హవా కనిపించింది. దీంతో గత ఎన్నికల్లో 143 సీట్లలో గెలిచిన బిజెపి ఈసారి 165 సీట్లలో విజయం సాధించింది. కాంగ్రెసు ఆరవై సీట్ల మార్కును కూడా దాటలేకపోయింది. 58 సీట్లతో సరిపెట్టుకుంది. గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో గెలుపొందిన బిఎస్పీ ఈసారి నాలుగింటిలో గెలిచింది.

ఛత్తీస్‌గఢ్‌పై మొదటి నుండి సస్పెన్స్ కొనసాగింది. కాంగ్రెసు, బిజెపి నువ్వా - నేనా అన్నట్లు కనిపించినప్పటికీ ఆఖరున బిజెపినే గెలుపు వరించింది. 49 సీట్లు బిజెపికి రాగా, కాంగ్రెసు 39 స్థానాలలో గెలుపొందింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ రాజ్ నంద్ గాంవ్‌లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి అల్కా ముదలియార్ పైన 35వేలకు పైగా ఆధిక్యంతో గెలుపొందారు. బస్తర్ జిల్లాలో మాత్రం ఇటీవల కాంగ్రెసు నేతలు నక్సల్స్ దాడిలో మృతి చెందడంతో అక్కడ ఆ పార్టీకి సానుభూతి పవనాలు వీచి ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది.
ఇక రాజస్థాన్‌లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బిజెపికి వరంగా మారింది. అంతేకాకుండా వసుంధరా రాజేకు ఉన్న ఆదరణ, మోడీ హవా ఇక్కడ పని చేసింది. దీంతో కాంగ్రెసును బిజెపి చిత్తుగా ఓడించింది. బిజెపి 162 స్థానాల్లో, కాంగ్రెసు 21 స్థానాల్లో గెలుపొందింది. 2008లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 96 స్థానాల్లో, బిజెపి 78 స్థానాల్లో గెలిచింది. గతంలో కంటే బిజెపి ఇప్పుడు రెండింతల సీట్లను కైవసం చేసుకుంది.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications