మరో సర్వే నితీష్‌కి షాక్: బిజెపిదే గెలుపు, 125సీట్లు

న్యూఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాల పైన సర్వేల ఫలితాలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. నిన్న ఇండియా టుడే ఛానల్ తరఫున సీ ఓటర్ జరిపిన సర్వేలో మహాకూటమి గెలుస్తున్నట్లుగా తేలింది. తాజాగా, నితీష్ కుమార్ - లాలూ ప్రసాద్ యాదవ్‌కు కూటమి షాక్ తగులుతోందని మరో సర్వే తేల్చింది.

బీహార్ ఎన్నికల్లో బిజెపి కూటమికే ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయని ఇండియా టుడే ఛానల్ కోసం ప్రజాభిప్రాయ సేకఱణ జరిపిన సిసెరో సంస్థ తెలిపింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న శాసన సభలో బిజెపి, మిత్రపక్షాలకు 125 స్థానాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.

BJP can win Bihar, projects India Today-Cicero pre poll survey

జెడియూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ మహాకూటమికి 106 స్థానాలు లభిస్తాయని తెలిపింది. ఈ ఎన్నికలు పోటాపోటీగా ఉంటాయని చెప్పింది. మహా కూటమి ఓట్ల శాతం 9.8 శాతం తగ్గి 40 శాతంగా ఉంటుందని, బిజెపి కూటమి ఓట్లు 18 శాతం పెరిగి42 శాతంగా ఉంటాయని చెప్పింది.

ముఖ్యమంత్రి పదవి విషయంలో మాత్రం నితీష్ కుమార్‌ను కోరుకుంటున్నారని సర్వేలో తేలింది. నితీష్ కుమార్ తర్వాత స్థానంలో బిజెపికి చెందిన సుశీల్ కుమార్ మోడీ, ఆ తర్వాత ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+