యడియూరప్ప అగ్గి రాజేశారు: టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు రద్దు!
బెంగళూరు: ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. శాసనసభలో బలాన్ని నిరూపించుకున్న రెండోరోజే అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాన్ని తీసుకున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప. మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను నిర్వహించకూడదని విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. యడియూరప్ప తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనది భారతీయ జనతాపార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా.. లక్షలాది మంది మైనారిటీల మనోభావాలను కించపరిచారంటూ కాంగ్రెస్ విమర్శలకు పదును పెడుతోంది.
టిప్పు జయంతిపై మొదటి నుంచీ వ్యతిరేకతే..
ఏటా నవంబర్ లో కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తరువాత ఏర్పాటైన కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి సర్కార్.. ఈ ఆనవాయితీని కొనసాగించాయి. ఏటా క్రమం తప్పకుండా టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహిస్తూ వచ్చాయి. గత ఏడాది కూడా నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన విషయం తెలిసిందే. టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని కర్ణాటక బీజేపీ నాయకులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. మైసూరును పరిపాలించిన వడయార్ రాజవంశీయులపై దండెత్తిన టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉత్సవాలను వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికోసం వారు ఆందోళనలను కూడా చేపట్టిన రోజులు ఉన్నాయి.

మైనారిటీల మనోభావాలను కించపరిచారంటోన్న కాంగ్రెస్, జేడీఎస్
బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ దాన్ని లెక్క చేయలేదు గత ప్రభుత్వాలు. బ్రిటీషర్లను గడగడలాడించిన టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను ఎందుకు నిర్వహించకూడదనేది బీజేపీయేతర పార్టీల ప్రశ్న. ఇదివరకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మార్చి, టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని కూడా గతంలో సిద్ధరామయ్య ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ.. అది సాధ్యం కాలేదు. తాజాగా- ప్రభుత్వం పార్టీలు మారిన నేపథ్యంలో టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు రద్దు కానున్నాయి. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కాంగ్రెస్ మండి పడుతోంది. విమర్శనాస్త్రాలను సంధిస్తోంది. రాష్ట్రంలో నివసిస్తోన్న లక్షలాది మంది మైనారిటీల మనోభావాలను కించపరిచిందని కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) నాయకులు అప్పుడే విమర్శించడం మొదలు పెట్టేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని బీజేపీపై ధ్వజమెత్తుతున్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications