Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ ఫినిష్, కాపాడే నాథుడేడి? - నాడు సింధియా, నేడు ఆజాద్-సిబల్ - సీడబ్ల్యూసీపై బీజేపీ రియాక్షన్

నాయకత్వ సంక్షోభం ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీలో సోమవారం నాటి 'కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ)' సమావేశం తీవ్ర కలకలం రేపింది. వరుస పరిణామాలపై రాజకీయంగానూ దుమారం లేసింది. సోనియా గాంధీకి ఘాటు లేఖ రాసిన సీనియర్ నేతలు బీజేపీ ఉచ్చులో పడిపోయారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారని వార్తలు రావడంతో కమలనాథులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Recommended Video

    Sonia Gandhi -'Will Step Down,Find A New Chief' Sonia Responds To Congress Leaders Letter

    కాంగ్రెస్ సీనియర్లు బీజేపీతో కుమ్మకయ్యారన్న మాటలు తాను అనలేదని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చుకున్నప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రధానంగా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ ను ఉద్దేశించి రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారని, ప్రియాంక గాంధీ సైతం ఆజాద్ పై ఆగ్రహం వ్యక్తం చేశారని వచ్చిన వార్తలు, నాయకత్వం ఎవరు చేపట్టాలనేదానిపై ఎటూ నిర్ణయించుకోలని పరిస్థితిపై బీజేపీకి చెందిన మధ్యప్రదేశ్ ఎంపీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

    BJP concern over azad and sibal, saffron leader says Congress is finished, no one can save

    ''నాడు జ్యోతిరాదిత్య సింధియా విషయంలోనూ ఇదే జరిగింది. పార్టీకి ఫుల్ టైమ్ ప్రెసిడెంట్ ఉండాలన్న సింధియాపై బీజేపీ కోవర్టుగా ముద్ర వేశారు. ఇప్పుడు అవే ప్రశ్నలు వేసిన గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ పైనా బీజేపీతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పార్టీని ఎవరూ కాపాడలేరు'' అని శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ఇక..

    BJP concern over azad and sibal, saffron leader says Congress is finished, no one can save

    కాంగ్రెస్ లో అంతర్గత పరిణామాలపై స్పందిస్తూ బీజేపీ నేత ఉమా భారతి మరింత ఘాటైన కామెంట్లు చేశారు. ''గాంధీ-నెహ్రూ కుటుంబ మనుగడ సంక్షోబంలో పడింది. రాజకీయంగా వాళ్ల ఆధిపత్యం ముగిసింది. తద్వారా కాంగ్రెస్ పని ఫినిష్ అయింది. ఇప్పుడు వాళ్ల మాటలకు విలువ లేదు. ఒకవేళ తిరిగి నిలబడాలనుకుంటే, కాంగ్రెస్ తన విదేశీ మూలాలను పూర్తిగా తెంచేసుకుని, స్వదేశీగా మారాలి''అని ఉమా భారతి అభిప్రాయపడ్డారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+