వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Liquor Scam Video: లిక్కర్ స్కామ్‍పై బీజేపీ స్టింగ్ ఆపరేషన్.. వీడియో విడుదల..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ లిక్కర్ స్కామ్ అటు ఢిల్లీతో పాటు ఇటు తెలంగాణలో ప్రకంపనలు సృష్టించాయి. ఈ కుంభకోణంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. అయితే తాజాగా బీజేపీ ఓ స్టింగ్ ఆపరేషన్ వీడియో విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో అమిత్ అరోరా అనే వ్యక్తి మద్యం విక్రయం, లావాదేవీల గురించి మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మీడియా సమావేశంలో బీజేపీ నేతలు ఈ వీడియో రిలీజ్ చేశారు.

ఒబెరాయ్ హోటల్

ఒబెరాయ్ హోటల్

"గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే లిక్కర్ సరఫరా అవుతోంది. ఢిల్లీలోని ఒబెరాయ్, లోథి హోటల్స్ లో కూర్చుని ఈ లిక్కర్ పాలసీని తయారు చేశారు. అరుణ్ పిళ్లై, దీపకౌర్ చడ్డా, సమీరా మహేంద్ర, అమండల్ సహా పలువురు కలిసి ఈ పాలసీ రూపొందించారు." అని ఆ వీడియోలో అమిత్ అరోరా మాట్లాడుతున్నట్లు కనిపిస్తుంది.

ప్రతి వైన్ షాపు నుంచి రూ.5 కోట్లు

లిక్కర్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బులను ఆప్ సర్కార్ పంజాబ్, గోవా ఎన్నికలలో ఖర్చు పెట్టిందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ప్రతి వైన్ షాపు దగ్గర నుంచి రూ.5 కోట్లు తీసుకున్నారని కమలం పార్టీ అధికార ప్రతినిధులు అన్నారు. అవినీతిని అంతం చేస్తానన్న కేజ్రీవాల్.. అధికారంలోకి వచ్చాక దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ వీడియోపై ఆప్ స్పందించింది.

అరెస్ట్ చేయండి

అరెస్ట్ చేయండి

మద్యం కుంభకోణంపై స్టింగ్ ఆపరేషన్ వీడియో నిజమైనదైతే తనను అరెస్టు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గురువారం బీజేపీకి సవాల్ విసిరారు. "ఈ స్టింగ్ వీడియో నిజమైనదైతే, సిబిఐ నన్ను నాలుగు రోజుల్లో అంటే సోమవారంలోగా అరెస్టు చేయాలి, లేకపోతే ఇది నకిలీ వీడియో అని అంగీకరించాలి" అని అన్నారు.

English summary
BJP releases video of sting operation on liquor scam. AAP criticized this video as fake.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X