ఏం కావాలో తీసుకోండి, రాజ్యసభ ఎన్నికలతో అలర్ట్, రిసార్ట్ లో ఎమ్మెల్యేలు, రెడ్డి గెలుపే లక్షంగా !

కర్ణాటక రాష్ట్ర శాసనసభ నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. క్రాస్ ఓటింగ్ జరగకుండా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలు అనేక జాగ్రత్తలు తీసుకున్నాయి. మూడు పార్టీలు తమ తమ ఎమ్మెల్యేల ఓట్లను కాపాడుకోవడంతోపాటు అదనపు ఓట్లకు గాలం వేస్తున్నాయని వెలుగు చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ త‌న ఎమ్మెల్యేల‌ను సోమ‌వారం ఓ ప్ర‌యివేట్ హోట‌ల్‌కు వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతోపాటు బీజేపీ, జేడీఎస్‌ ఎమ్మెల్యేలను మరో హోటల్‌ తో పాటు రిసార్ట్‌కు తరలించే ఆలోచన చేసినట్లు తెలిసింది. సోమవారం ఉదయం ప్రారంభం అయిన శాసన సభలో ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ మృతికి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత సభాకార్యక్రమాలను బుధవారానికి వాయిదా వేసి వెంటనే శాసనసభా భవనంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశాన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు.

BJP, Congress and JDS parties are taking the Rajya Sabha elections with pride in Karnataka.

అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓ ప్రైవేట్ హోటల్‌కు తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఓటింగ్‌ జరిగే విధానసౌదకు నేరుగా చేరుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లాన్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన నాయకులను గెలిపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే క్రాస్ ఓటింగ్ తో కుపేంద్ర రెడ్డిని గెలిపించుకోవాలని బీజేపీ, జేడీఎస్ నాయకులు ప్లాన్ చేశారు. మంగళవారం జరగనున్న రాజా వెంకటప్ప నాయక్‌ అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో మాత్రమే నేతలు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 135 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు, సర్వోదయ కర్ణాటక పార్టీకి ఒక ఎమ్మెల్యే, కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీకి గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఉన్నారు. స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి ఎమ్మెల్యేల మద్దతుతో కుపేంద్ర రెడ్డికి ఓట్లు వేయించి ఆయన్ను రాజ్యసభకు పంపించాలని జేడీఎస్, బీజేపీ ప్లాన్ చేసింది.

BJP, Congress and JDS parties are taking the Rajya Sabha elections with pride in Karnataka.

రాజ్యసభ ఎన్నికల సందర్బంగా కర్ణాటకలో రిసార్టు రాజకీయాలు మొదలైనాయి. కాంగ్రెస్‌ నుంచి జీసీ చంద్రశేఖర్‌, సయ్యద్‌ నాసీర్‌ హుస్సేన్‌, కేంద్ర మాజీ మంత్రి అజయ్‌ మాకెన్‌, బీజేపీ నుంచి నారాయణ స్వామి, జేడీఎస్‌ నుంచి రాజ్యసభ మాజీ సభ్యుడు కుపేంద్ర రెడ్డి బరిలో ఉన్నారు. గతంలో శాసనమండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం కాంగ్రెస్‌ను ఇబ్బంది పెట్టింది. ఇలా ఎన్నికలకు ఒకరోజు ముందు ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటు వేయాలో స్పష్టంగా సూచిస్తారు.

ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి? రెండవ ప్రాధాన్యత ఓటు ఏ అభ్యర్థికి వేయాలి అని కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ నాయకులు ఎమ్మెల్యేలకు సూచించనున్నారని తెలిసింది. మంగళవారం జరిగే రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌లో ఒక్కో అభ్యర్థి గెలవాలంటే 45 మంది ఎమ్మెల్యేలు ఓటు వెయ్యాలి. అందుకే ముందుజాగ్రత్త చర్యగా ఒక్కో అభ్యర్థికి 46 ఓట్లు వేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. బీజేపీ-జేడీఎస్ కూటమి ఎత్తుగడ ఏమిటి? అని కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. బీజేపీ, జేడీఎస్‌లు కూడా క్రాస్ ఓటింగ్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేశాయి.

BJP, Congress and JDS parties are taking the Rajya Sabha elections with pride in Karnataka.

ఒక్క సీటును సులభంగా గెలుచుకునే సంఖ్యా బలం బీజేపీకి ఉంది. అయితే బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా జేడీఎస్‌ నుంచి కుపేంద్రరెడ్డి బరిలో ఉండటంతో ఆయనకు 5-6 ఓట్ల లోటు ఉంది. దీంతో కుపేంద్రరెడ్డిని గెలిపించుకోవడానికి జేడీఎస్ నాయకులు భలేప్లాన్ చేశారని తెలిసింది. కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేల ఓట్లను క్రాస్ ఓటింగ్ కు గురిచేసే అవకాశం ఉందని ఇప్పుడు కాంగ్రెస్ లో భయం పట్టుకుందని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+