కాలేజ్ అమ్మాయిల బాత్ రూమ్ లో వీడియోలు తీసి ఫ్రెండ్స్ గ్రూప్ లో షేర్, బీజేపీ వార్నింగ్!
బెంగళూరు/ఉడిపి: కర్ణాటకలోని ఉడిపిలోని ఓ కాలేజ్ లో అమ్మాయిల బాత్ రూమ్ లో వీడియోలు చిత్రీకరించి ఇతర విద్యార్థులకు షేర్ చేసిన వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎమ్మెల్సీ రవికుమార్ బెంగళూరులో మీడియాతో మాట్లాడారు.
కాలేజ్ అమ్మాయిల బాత్ రూమ్ ల్లో తీసిన వీడియోలు సాటి అమ్మాయిలు ఎవరెవరికి షేర్ చేశారు, ఎంత మందికి షేర్ చేశారు అనే పూర్తి సమాచారం బయటకు రావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉడిపి కాలేజ్ వ్యవహారంలో ఇదేనెల 27వ తేదీన కర్ణాటక బీజేపీ మహిళా మోర్చ ఆధ్వర్యంలో కర్ణాటక మొత్తం నిరసనలు వ్యక్తం చేస్తామని ఎమ్మెల్సీ రవివకుమార్ అన్నారు.

ఉడిపిలోని నేత్రాజ్యోతి పారామెడికల్ కాలేజ్ లో చదువుతున్న అలిమతుల్లా సయోఫ, శబనాజ్, ఆలియా అనే ముస్లీం కాలేజ్ అమ్మాయిలు హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చూసుకుని బాత్ రూమ్ ల్లో సీక్రేట్ గా వీడియోలు తీసి అదే కాలేజ్ లో చదువుతున్న ఫ్రెండ్స్ గ్రూప్ లో, ఇతరలకు షేర్ చేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.
అమ్మాయి బాత్ రూమ్ లో హిందూ అమ్మాయిలను మాత్రమే టార్గెట్ చేసి వీళ్లు వీడియోలు తీసి కాలేజ్ విద్యార్థులకు పంపించి అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడారని బీజేపీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ తేజస్వి గౌడ మండిపడ్డారు. అమ్మాయిల జీవితాలతో చెలగాటం ఆడాలని కొందరు ముస్లీం అమ్మాయిలను రెచ్చగొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
కాలేజ్ అమ్మాయిను రెచ్యగొట్టిన వాళ్ల అందరి పేర్లు బయటకు వచ్చేలా పోలీసులు దర్యాప్తు చెయ్యాలని, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మహిళలు అందరూ పోరాటం చేస్తారని తేజస్వి గౌడ హెచ్చరించారు. ఉడిపిలోని కాలేజ్ లో అమ్మాయిల వీడియోలు తీసి షేర్ చెయ్యడం, కొందరు వాటిని మళ్లీ వాళ్ల ఫ్రెండ్స్ కు షేర్ చేశారని వెలుగు చూడటం ఇటీవల కలకలం రేపింది.












Click it and Unblock the Notifications