మోడీ బిగ్ ప్లాన్ ? ఒకటే ఎన్సీపీ..! తర్వాతే ఎన్డీయేలోకి..!
పార్లమెంట్ కీలక బిల్లుల్ని ఆమోదించేందుకు ప్రధాని మోడీ (PM MOdi) సిద్దమవుతున్న వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా బిల్లుల్ని నెగ్గించుకోవడంలో విఫలమైన కేంద్రం.. ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీల్ని చీల్చి తమ పంతం నెగ్గించుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) శరద్ పవార్ వర్గాన్ని సైతం తమవైపు తిప్పుకోవాలని బీజేపీ (bjp) భావిస్తోంది. అయితే అంతకు ముందే మరో ప్లాన్ సిద్దం చేసింది.
గతంలో మహారాష్ట్రలో శివసేనను షిండే చీల్చిన సమయంలోనే అజిత్ పవార్ రూపంలో ఎన్సీపీలోనూ చీలిక ఏర్పడింది. తద్వారా మహారాష్ట్రలో షిండేకు సీఎం పదవి ఇచ్చి దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ లను ఉపముఖ్యమంత్రులుగా నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే గెలుపు తర్వాత ఫడ్నవీస్ ను సీఎంను చేసి అజిత్ పవార్, షిండేలను డిప్యూటీ సీఎంలను చేశారు. అయితే అనూహ్యంగా అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో ఆయన భార్య సునేత్రా పవార్ ను డిప్యూటీ సీఎం చేశారు. ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ వర్గాన్ని సైతం తమవైపుకు తిప్పుకోవాలని ప్రధాని మోడీ భావించారు.

అయితే చివరి నిమిషంలో ఈ విషయంలో వెనక్కి తగ్గారు. ఎన్సీపీ రెండు వర్గాలను విడివిడిగా ఉంచి ఎన్డీయేలో చేర్చుకుంటే రెండు వర్గాల డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుంది. అలా కాకుండా రెండు వర్గాల్నీ కలిపేస్తే ఉమ్మడిగే చేసే డిమాండ్లను మాత్రమే నెరవేరిస్తే సరిపోతుంది. అందుకే త్వరలో ఎన్సీపీలో రెండు వర్గాల్ని కలిసిపోయేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే శరద్ పవార్ ఈ మేరకు సంకేతాలు ఇచ్చేశారు. అటు సునేత్రా పవార్ కూడా అందుకు సిద్దంగానే ఉన్నారు. దీంతో ఎన్సీపీ అధినేతగా తిరిగి పవార్ నే ఉంచి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్రనే కొనసాగిస్తూ, జాతీయ రాజకీయాల్లో ఎన్సీపీని వాడుకోవాలని ప్రధాని మోడీ ప్లాన్ చేశారు. ఇది జరిగితే పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఆటంకాలను కూడా ఎన్డీయే అధిగమిస్తుంది. పవార్ కుమార్తె సుప్రియా సూలే మాత్రం ఈ వార్తల్ని తోసిపుచ్చుతూనే ఉన్నారు. కానీ పవార్ మాత్రం పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.














Click it and Unblock the Notifications