కేంద్ర కేబినెట్‌లో 5 శాఖలు: ఆయనకు కీలక పోర్ట్‌ఫోలియో వెనుక..: బీజేపీ లెక్క పక్కా

Modi's cabinet: కేంద్ర కేబినెట్‌లో కర్ణాటకకు ఆశించిన దానికంటే పెద్ద వాటా లభించింది. బీజేపీ బలంగా ఉన్న ఈ రాష్ట్రానికి మంత్రివర్గంలో నాలుగు బెర్తులు లభించాయి. ఇక్కడి నుంచే రాజ్యసభకు ఎన్నికైన నిర్మల సీతారామన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య అయిదుకు చేరుతుంది.

ఎక్కువ బెర్త్‌లను దక్కించుకున్న దక్షిణాది రాష్ట్రం ఇదొక్కటే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మిత్రపక్షం జనతాదళ్ (సెక్యులర్) అధినేత హెచ్ డీ కుమారస్వామి, గత కేబినెట్‌లో పని చేసిన శోభా కరంద్లాజె, ప్రహ్లాద్ జోషితో పాటు కొత్తగా లింగాయత్ నాయకుడు వీ సోమణ్ణను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకున్నారు.

BJP eys on Lingayat leader V Somanna as alternate to BS Yediyurappa

నిర్మల సీతారామన్, శోభా కరంద్లాజె, ప్రహ్లాద్ జోషి.. గతంలో కూడా కేంద్ర కేబినెట్‌లో పని చేశారు. తమ పదవులను నిలబెట్టుకున్నారు. ఇప్పుడూ కొనసాగారు. వారికి ప్రాధాన్యత గల శాఖలను కేటాయించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనికి గల కారణం- గతంలో వారు చూపిన పనితీరే కారణం.

కాగా- కొత్తగా లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వీ సోమణ్ణను కేంద్ర కేబినెట్‌లో తీసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాశమౌతోంది. కోటా పూర్తయినప్పటికీ సోమణ్ణ కోసం పట్టువిడుపులను బీజేపీ అధిష్ఠానం ప్రదర్శించిందనేది ఇక్కడ స్పష్టమౌతోంది. ఆయనకు రైల్వే, జల్‌శక్తి శాఖల సహాయమంత్రిగా అపాయింట్ చేసింది.

దీనికి కారణం లేకపోలేదు. సోమణ్ణ- లింగాయత్ సామాజిక వర్గ నాయకుడు కావడమే. ఇదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి, కర్ణాటక బీజేపీకి పెద్దదిక్కు బీఎస్ యడ్యూరప్పకు బదులుగా సోమణ్ణను తెరమీదికి తీసుకుని రావాలనే ఉద్దేశంలో బీజేపీ అధిష్ఠానం ఉందని చెబుతున్నారు. యడ్యూరప్ప కుమారుడు రాఘవేంద్ర ఇప్పటికే రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు.

మొన్నటి ఎన్నికల్లో తుమకూరు నుంచి విజయం సాధించారు సోమణ్ణ. ఆయనతో పాటు లింగాయత్‌కే చెందిన మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై- హవేరి, జగదీష్ షెట్టార్- బెళగావి, బీవై రాఘవేంద్ర- శివమొగ్గ, పీసీ గడ్డిగౌడర్ (బాగల్‌కోట్) నుంచి గెలిచారు. వారందరిలోకి సోమణ్నను తీసుకోవడానికి కారణం- ఆయనకు ఉన్న రాజకీయానుభవమేనని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+