Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షిండే వర్గం-బీజేపీ మధ్య చిచ్చు రాజేసిన బురఖా

Maharashtra Assembly election 2024:మహారాష్ట్రలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ముస్లిం మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు షిండే వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే యామినీ జాదవ్ బురఖాలు పంచారు, ఈ ఘటన మహాయుతి కూటమిలో వివాదం సృష్టించింది.షిండే గ్రూపు ఎమ్మెల్యే ముస్లిం ఓటర్లకు బురఖాలు పంపిణీ చేయడంపై అధికార మహాయుతి మిత్రపక్షమైన బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బురఖా పంపిణీ వంటి బుజ్జగింపు రాజకీయాలు అస్సలు ఆమోదయోగ్యం కాదని బీజేపీ మహిళా నేత ఆశిష్ షెలార్ అన్నారు.

యామిని జాదవ్ బురఖా పంపిణీ చేశారు

సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి చెందిన యామినీ జాదవ్ బైకుల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే. బైకుల్లా నియోజకవర్గం ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం, ఇక్కడ యామిని జాదవ్ ఇటీవల ముస్లిం మహిళలకు బురఖా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై మహాయుతి ప్రభుత్వంలోని ప్రతిపక్ష పార్టీ శివసేన (యుబిటి) తీవ్రంగా టార్గెట్ చేసింది. ఇప్పుడు మహాయుతిలో భాగంగా ఉన్న బీజేపీ కూడా విమర్శలు గుప్పించింది.భారతీయ జనతా పార్టీకి బురఖాలు పంచడం లాంటి బుజ్జగింపు రాజకీయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని బీజేపీకి చెందిన ఆశిష్ షెలార్ అన్నారు.

BJP Furious Over Shinde Faction MLA s Burqa Distribution to Muslim Women
షిండే వర్గంను చుట్టుముట్టిన బురఖా వివాదం

బురఖాలు పంపిణీ చేయడం తన ఎన్నికల ప్రచారంలో భాగం కాదని యామినీ జాదవ్ తన వాదనను వినిపించారు. అయితే యామినీ వ్యాఖ్యలతో అనుమానాలు మరింత బలపడ్డాయి.దీంతో విమర్శలు ఎక్కువయ్యాయి. సాంప్రదాయకంగా హిందుత్వ పార్టీగా గుర్తింపు పొందిన షిండే వర్గం, యామినీ బురఖాల పంపిణీ కార్యక్రమంతో తన ప్రాధాన్యతలో మార్పును సూచిస్తోందా అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు ప్రత్యర్థులు.

ఠాక్రే గ్రూప్ షిండే గ్రూప్ కపటత్వం అని ఆరోపించారు

ఓ వైపు ముస్లింల పట్ల విద్వేషాలు రెచ్చగొడుతూనే మరోవైపు ముస్లిం మహిళలకు బురఖాలు పంపిణీ చేస్తూ బుజ్జగిస్తోందని, షిండే వర్గం కపటత్వంతో వ్యవహరిస్తోందని ఉద్ధవ్ ఠాక్రే వర్గం మహిళా నాయకురాలు సుష్మా అందారే విరుచుకుపడ్డారు.

లోక్‌సభ ఎన్నికల్లో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేనకు ముస్లిం సమాజం నుంచి విపరీతమైన మద్దతు లభించింది.దీంతో ముస్లిం సామాజిక వర్గం షిండే వర్గానికి దూరం కాకూడదని వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తోందనే వాదన వినిపిస్తోంది. అయితే షిండే వర్గం శివసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం ముస్లిం మహిళలకు బురఖాలు పంచిపెట్టడాన్ని తప్పుబట్టి ఒకరకంగా షిండే శివసేనను ఇరకాటంలోకి నెట్టివేసింది. కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలో పాఠశాలల్లో కాలేజీల్లో బురఖా లేదా హిజబ్ ధరించడంపై నిషేధం ఉండేది. ఇది అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారి తీసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+