సిద్దూ తల నరుకుతానని చెప్పిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు, మాజీ డీఎంసీతో పోటీపడి !
బెంగళూరు/శివమొగ్గ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకల్లో కొత్త ముఖాలను రంగంలోకి దింపిన బీజేపీ హైకమాండ్ వారిని గెలిపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నది. మాజీ సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ యువకులకు పెద్ద పీట వెయ్యాలని ప్రయత్నించింది.
శివమొగ్గ నియోజక వర్గంలో బీజేపీలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్. ఈశ్వరప్పకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించింది. చివరికి కేఎస్. ఈశరప్ప కుమారుడు కాంతేష్ కు సీటు ఇస్తామని చివరి వరకు చెబుతూనే వచ్చిన బీజేపీ హైకమాండ్ క్లైమాక్స్ లో ఆయనకు కూడా హ్యండ్ ఇచ్చింది.

శివమొగ్గ నియోజక వర్గం ఎమ్మెల్యే సీటును చెన్నబసప్పకు ఇచ్చింది. ఈనెల 19వ తేదీన చెన్నబసప్ప నామినేషన్ వేశారు. విచిత్రం ఏమిటంటే చివరివరకు కొడుక్కి ఎమ్మెల్యే సీటు ఇప్పించాలని ప్రయత్నించిన కేఎస్. ఈశ్వరప్ప కూడా చెన్నబసప్ప నామినేషన్ వేసే సమయంలో ఆయన వెంట వెళ్లారు.
2015లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉన్నారు. తాను గొడ్డు మాంసం తింటానని ఆ సమమంలో అప్పటి సీఎం సిద్దరామయ్య అన్నారు. ఆ సమయంలో చెన్నబసప్ప శివమొగ్గలో కౌన్సిలర్. బీజేపీ కౌన్సిలర్ అయిన చెన్నబసప్ప 2015 నవంబర్ 2వ తేదీన సిద్దరామయ్య మీద సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.
శివమొగ్గకు వచ్చి సిద్దరామయ్య గొడ్డు మాంసం తింటే ఆయన తల నరుకుతానని చెన్నబసప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా సీఎం సిద్దరామయ్య తల నరుకుతానని చెన్నబసప్ప రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని శివమొగ్గ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పీవీ. విశ్వనాథ్ కేసు పెట్టారు. బీజేపీ నాయకుడు చెన్నబసప్పను పోలీసులు అరెస్టు చేశారు.
జైలుకు వెళ్లిన చెన్నబసప్ప తరువాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ సందర్బంలో సొంత బీజేపీ నాయకులు కూడా చెన్నబసప్పకు మద్దతు ప్రకటించలేదు. భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ కార్యక్రామాల్లో చురుకుగా పాల్గొనే చెన్నబసప్పకు ఆ రెండు సంస్థల నాయకుల దగ్గర మంచి పేరు సంపాధించుకున్నారు.
బీజేపీ నాయకుడు హర్షా హత్య జరిగిన సమయంలో, విద్యాసంస్థల్లోకి బుర్ఖాలు వేసుకుని వెళ్లరాదని జరిగిన ఆందోళనల్లో చెన్నబసప్ప చురుకుగా పాల్గొన్నారు. ఈ విషయాలు అన్ని కలిసిరావడంతో మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్పను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్ చెన్నబసప్పకు ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. చెన్నబసప్ప తనకు రూ. 1. 05 కోట్ల ఆస్తి ఉందని, తనకు, తన భార్యకు మూడు స్కూటర్లు ఉన్నాయని, సొంత కారు లేదని ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్ లో వివరాలు సమర్పించారు.












Click it and Unblock the Notifications