ఐటీ హబ్ లో ఇదో మాఫియా, ఇసుక మాఫియాకు పోటీగా ?, సీఎంపై చిందులు వేస్తున్న లీడర్స్
మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్దం నెలకొంది. అదే సమయంలో ఇప్పుడు కర్ణాటకలో నీటి కోసం దినదిన గడం గడిపే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేతలు ఈ విషయాన్ని హైలెట్ చేసి సిద్దరామయ్య ప్రభుత్వం మీద తీవ్రఆరోపణలు చేస్తున్నది. కర్ణాటక బీజేపీ, కర్ణాటక కాంగ్రెస్ మధ్య ట్వీట్ల పోరు జోరుగా సాగిందని చెప్పొచ్చు.
రెండు పార్టీల నేతలు ఒకరినొకరు వెక్కిరిస్తూ సోషల్ మీడియాతో పాటు ప్రత్యక్షంగా మీడియా ముందు మాటల యుద్ధం సాగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా కర్ణాటకలో ట్యాంకర్ మాఫియా పెద్దఎత్తున నడుస్తోందని కర్ణాటక బీజేపీ ఆరోపించింది. కర్ణాటక బీజేపీ, కర్ణాటకలోని ట్యాంకర్ మాఫియాపై బీజేపీ ఆరోపణలు చేస్తూ గ్రామాల్లోనే కాకుండా పారిశ్రామిక ప్రాంతాల్లో ట్యాంకర్ మాఫియా వ్యాపారం చేసేందుకు @INCKarnataka ప్రభుత్వం తెరలేపిందని బీజేపీ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అకస్మాత్తుగా పారిశ్రామిక వాడలు, బెంగళూరుతో పాటు అనేక సిటీల్లో నీటి సరఫరాను తగ్గించిందని, అక్కడికి సరఫరా చేసే నీటి పరిమాణాన్ని తగ్గించి ట్యాంకర్ మాఫియాకు తెరలేపిందని బీజేపీ ఆరోపిస్తోంది. బెంగళూరు నగరంలోని పీణ్యా పారిశ్రామిక ప్రాంతం ఉంది ఇక్కడ 60 శాతం నీటి సరఫరా తగ్గిందని కర్ణాటక బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది. కర్ణాటక బీజేపీ తన ట్వీట్‌లో తన ఆరోపణలను కొనసాగించింది.
ఉద్యోగులు నీటి కొరతతో నానా ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ ఆరోపించింది. పీణ్యా పారిశ్రామిక ప్రాంతంలోని 12 లక్షల మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. @siddaramaiah ప్రభుత్వానికి వసూళ్ల దాహం కారణంగా ఒక్క పీణ్యా పారిశ్రామిక ప్రాంతంలోనే దాదాపు 4. 5 లక్షల మంది మహిళలు పనులు లేక వేతనాల కోతతో అల్లాడిపోతున్నారని బీజేపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసింది.
ಬಡಾವಣೆಗಳಲ್ಲಷ್ಟೇ ಅಲ್ಲದೆ, ಕೈಗಾರಿಕಾ ಪ್ರದೇಶಗಳಲ್ಲೂ ಟ್ಯಾಂಕರ್ ಮಾಫಿಯಾಗೆ ವ್ಯವಹಾರ ಕುದುರಲಿ ಎಂಬ ಉದ್ದೇಶದಿಂದ ಪೀಣ್ಯ ಕೈಗಾರಿಕಾ ಪ್ರದೇಶಕ್ಕೆ ಸರಬರಾಜು ಮಾಡುತ್ತಿದ್ದ ನೀರಿನ ಪ್ರಮಾಣದಲ್ಲಿ @INCKarnataka ಸರ್ಕಾರ ದಿಢೀರನೆ ಶೇ. 60ರಷ್ಟು ಕಡಿತ ಮಾಡಿದೆ.
— BJP Karnataka (@BJP4Karnataka) February 26, 2024
ಉತ್ಪಾದನೆಗೆ ನೀರು ಅಗತ್ಯವಿಲ್ಲದ ಗಾರ್ಮೆಂಟ್ಸ್ನಂಥಲ್ಲಿಯೂ ನೌಕರರಿಗೂ… pic.twitter.com/YM4Mo5bpIL
ఇలా కర్ణాటక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పోరు ఇప్పుడు ట్యాంకర్ మాఫియాపై కూడా ప్రభావం చూపుతోంది. కానీ ఈ తిక్కమాటలు కేవలం మాటలకే పరిమితమా? లేక మా సమస్యలను పరిష్కరిస్తారా? వేచి చూడాలని ప్రజలు అంటున్నారు. ముఖ్యంగా బెంగుళూరు నగరంలో నీటి సమస్య విపరీతంగా ఉండడంతో ప్రజలు రోజూ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎప్పుడు తగిన చర్యలు తీసుకుంటుందోనని, మా సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారో అని ఐటీ హబ్ బెంగళూరు ప్రజలు ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications