మోదీ ఫోటో పెట్టుకుని మాజీ డీసీఎం మా మానం తీస్తున్నారు, ఈసీకి ఫిర్యాదు, మీ నాయన ఆస్తి కాదు!
లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వనందుకు ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప దెబ్బకు బీజేపీ నాయకులకు సినిమా కనపడుతోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా మాజీ సీఎం కొడుకు మీద పోటీ చేస్తున్న కేఎస్ ఈశ్వరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ఎవడి అబ్బ సోత్తు కాదని అంటున్నారు.
బీజేపీ నాయకులు, మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పల మధ్య మొదలైన పోరు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. చాలా రోజులు బీజేపీ నేతలు కేఎస్ ఈశ్వరప్పను శాంతింపజేసేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారు. ఇప్పుడు అదే కేఎస్ ఈశ్వరప్ప దెబ్బకు బీజేపీ నాయకులు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఉపయోగించవద్దని బీజేపీ తిరుగుబాటు నేత కేఎస్ ఈశ్వరప్పకు ఆదేశాలు జారీ చెయ్యాలని బీజేపీ నాయకులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.

లోక్‌సభ ఎన్నికలలో కొడుకు పోటీ చెయ్యడానికి బీజేపీ హైకమాండ్ నిరాకరించడంతో కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి ఈశ్వరప్ప శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. కర్ణాటక రాష్ట్ర బీజేపీలో కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా తాను పోరాడుతానని చెప్పిన ఈశ్వరప్ప కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుటుంబానికి మాత్రమే సవాల్ విసిరారు.
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి మరోసారి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌కు చేసిన ఫిర్యాదులో శివమొగ్గ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేఎస్ ఈశ్వరప్ప తాను నరేంద్ర మోదీ, బీజేపీ నాయకుల తరపున పోటీ చేస్తున్నానని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాడని, మోదీ ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజలను ఆయోమయానికి గురి చేస్తున్నారని బీజేపీ నాయకులు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేశారు.

తనకు తానుగా బీజేపీ నాయకుడు అని చిత్రీకరించుకుంటున్న ఈశ్వరప్ప బీజేపీ నాయకులకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, ఇది తప్పు అని, ఈశ్వరప్ప తన ప్రచారంలో ప్రధాని ఫోటోను ఉపయోగించకుండా చూడాలని బీజేపీ నాయకులు ఎన్నికల కమీషన్ కు మనవి చేశారు. గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్పను ఢిల్లీకి పిలిచి ఈ లోక్‌సభ నియోజకవర్గం నుండి మీ పోటీని ఉపసంహరించుకోవాలని కోరారని తెలిసింది.
అయితే శివమొగ్గ నుండి పోటీ చేయాలనే నిర్ణయంపై ఈశ్వరప్ప గట్టిగా ఉన్నారు. కేఎస్ ఈశ్వరప్పపై బీజేపీ చర్యలు తీసుకునే పక్షంలో ముందు జాగ్రత్త చర్యగా కర్ణాటక హైకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. దీనిపై బీజేపీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర 2009లో శివమొగ్గ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. శివమొగ్గ లోక్ సభ నియోజక వర్గం నుంచి బీవై రాఘవేంద్ర బీజేపీ సింబల్ పై, హీరో శివరాజ్‌కుమార్ భార్య గీతా శివరాజ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications