High Command: మరోసారి సీఎం ఢిల్లీ దండయాత్రం, గ్రీన్ సిగ్నల్ వస్తుందా ?, లేదా ?, మోదీ ఎఫెక్ట్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఢిల్లీ దండయాత్ర మరోసారి మొదలైయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజులు కర్ణాటకలో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటన బీజేపీ నాయకులు ఊహించిన దానికంటే ఎక్కువగానే విజయవంతం అయ్యింది.
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సక్సస్ అయ్యింది. మైసూరులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమం ఊహించనిదానికంటే విజయవంతం అయ్యింది. కర్ణాటక పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకుని సంతోషంగా ఢిల్లీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ కి పిలుపు వచ్చింది.

ఇంతకాలం తన పాలన మీద బీజేపీ హైకమాండ్ కు ఎవరు ఎన్ని ఫిర్యాదులు చేశారో ?, నా పదవి మీద ఎవరైనా కన్ను వేస్తున్నారా, నా గురించి హైకమాండ్ ఏమనుకుంటోంది అని అనే అనుమానాలు సీఎం బసవరాజ్ బోమ్మయ్ లో ఉండేవని, అందుకే ఆయన అదోరకంగా ఉంటున్నారని కొందరు బీజేపీ నాయకులు అంటున్నారు.
మంత్రివర్గ విస్తరణ పూర్తి చెయ్యాలని ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ అనేక సార్లు ఢిల్లీ వెళ్లారు. అయితే ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి హైకమాండ్ నుంచి సీఎంకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పుడు ప్రధాని మోదీ కర్ణాటక పర్యటన విజయవంతం కావడంతో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని, అందుకే సీఎం బసవరాజ్ బోమ్మయ్ ని ఢిల్లీ రావాలని హైకమాండ్ పిలిచిందని బీజేపీ నాయకులు చర్చించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications