ప్రతిపక్షం ప్లాన్ చేసేలోపు పాట పాడేసిన మోదీ, 50 % మంది వాషౌట్, మడతపెట్టి ఉతికేసి మోదీ టీమ్ !

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్ డీఏ హ్యాట్రిక్ విజయానికి బీజేపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే అభ్యర్థుల ఎంపికలో బీజేపీ నేతలు విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిందుత్వ ముద్ర వేసుకుని మాటలతోనే కాలం గడపేసిన సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ టిక్కెట్‌ ఇవ్వకపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పుడు ఎంపీ టికెట్ కోల్పోయిన బీజేపీ హిందుత్వ వాదులు ఎవరు? అని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ఆదివారం బీజేపీ తన మరో జాబితాను ప్రకటించింది, ఇందులో చాలా మంది సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్లు దక్కలేదు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగ సవరణకు అనుకూలమని బీజేపీ హైకమాండ్‌పై సంచలన వ్యాఖలు చేసిన కర్ణాటకలోని ఉత్తర కన్నడ బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డేకి బీజేపీ హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది.

BJP high command has alienated 50 percent sitting MPs in Karnataka

బీజేపీ సిట్టింగ్ ఎంపీ అనంత కుమార్ హెగ్డేకి మాత్రమే కాదు, అదే విధంగా హిందుత్వాన్ని సమర్థించిన చాలా మంది ఎంపీలకు, నాయకులకు ఈసారి ఎంపీ టిక్కెట్టు దక్కలేదు. దీని ద్వారా బీజేపీ వ్యూహం ఏమిటి? అని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకునే లోపు హస్తం నేతలకు బీజేపీ హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చేసింది. మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా, కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ తో పాటు హిందుత్వాన్ని సమర్థిస్తున్న పలువురు బీజేపీ ఎంపీలు ఇంటికి వెళ్లిపోయారు.

కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీలు అనంత్‌కుమార్ హెగ్డే, ప్రతాప్‌ సింహా, నళిన్‌ కుమార్ కటీల్‌లకు ఎంపీ టిక్కెట్లు దక్కలేదు. ఇతర రాష్ట్రాల్లో పరిశీలిస్తే ముఖ్యంగా సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కూడా బీజేపీ టిక్కెట్టు తప్పింది. ఒకవైపు పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు బీజేపీ హైకమాండ్ వీళ్లందరికీ ఎందుకు టిక్కెట్టు తప్పించింది అనే హాట్ టాపిక్ మొదలైయ్యింది. వీళ్ల విషయంలో బీజేపీ హైకమాండ్ అన్ని ఆలోచించిందని వెలుగు చూసింది.

హిందుత్వం వివాదంలో చిక్కుకున్న వీళ్ల గురించి బీజేపీ మరేదైనా వ్యూహం వేసిందా? కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలపై బీజేపీ హైకమాండ్‌ వ్యూహం ఏమిటి? అని ప్రజలు ఆసక్తిగా చర్చిస్తున్నారు. కర్ణాటకలోని శివమొగ్గలో మాజీ డీసీఎం కేఎస్ ఈశ్వరప్ప ఇప్పటికే బీజేపీపై తిరుగుబాటు చేశారు. అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇచ్చే విషయంలో ఎంపీలను ఇప్పుడు బీజేపీ ఎంపిక చేసిందని, కేవలం హిందుత్వ ముద్రతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే నాయకులను బీజేపీ పక్కన పెట్టిందని వెలుగు చూడటం కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

BJP high command has alienated 50 percent sitting MPs in Karnataka

సొంత ప్రాంతాలను అభివృద్ధి చేయని సిట్టింగ్ ఎంపీలందరికీ బీజేపీ హైకమాండ్ టిక్కెట్టు తప్పించిందని స్పష్టంగా వెలుగుగ చూసింది. దీంతో ప్రత్యర్థి పార్టీల వ్యూహాన్ని తారుమారు చేస్తూ బీజేపీ నేతలు సరికొత్త వ్యూహాన్ని రచించారు. ఈ కారణంగానే కర్ణాటకలో పలువురు సిట్టింగ్ ఎంపీలకు టిక్కెట్టు దక్కలేదు. అలాగే అనంత్ కుమార్ హెగ్డే, ప్రతాప్ సింహా, నళిన్ కుమార్ కటీల్ టిక్కెట్లు మిస్ అయ్యాయని ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.

కర్ణాటకలోని 24 నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఈ 24 నియోజకవర్గాల్లో 12 మంది సిట్టింగ్ ఎంపీలతో సహా దాదాపు 50 శాతం మందికి టిక్కెట్టు దక్కలేదు. దీంతో 2024 లోక్‌సభ ఎన్నికల రంగం మరింత రసవత్తరంగా మారుతోంది. ఎవరు ఓడిపోతారు? ఎవరు గెలుస్తారు? అనే దానికి ఓటర్ల నాడి తెలుసుకోవడానికి జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. మొత్తం మీద కర్ణాటకలో 50 శాతం సిట్టింగ్ ఎంపీలకు బీజేపీ హైకమాండ్ మంగళంపాడేయం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+