సీఎంకు చెక్ పెట్టాలంటే అదే కులం నాయకుడు కావాలి, హైకమాండ్ ప్లాన్ తో !
బెంగళూరు: గత మూడేళ్లకు పైగా కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో ఆ పార్టీ నాయకులు కంగుతిన్నారు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పుపై బీజేపీ నాయకుల్లో జోరుగా చర్చ సాగుతోంది. కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సొంత బలంతో అధికారంలోకి వస్తుందన్న ధీమాతో బీజేపీ హైకమాండ్ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ప్రచారం నిర్వహించింది,
అయితే రాష్ట్రంలో బీజేపీ ఘోర పరాజయం పాలైన ఆరు నెలల తర్వాత కూడా కర్ణాటక బీజేపీ శాఖ అధ్యక్షుడి నియామకం, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎంపిక ఇంత వరకు జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా కర్ణాటక బీజేపీని హైకమాండ్ నిర్లక్ష్యం చేసిందని బీజేపీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి నియామకం, కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి ఎంపికలో జాప్యం వెనుక ఉన్న కారణం మాత్రం బయటకు రాలేదు.

రెండు పదవుల్లో నాయకులను నియమించకపోవడంతో సొంత పార్టీ నాయకులు బీజేపీ హైకమాండ్ మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ సీనియర్ నాయకులు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2024 లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పటి నుంచే సిద్ధమవుతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా? లేదా ? అనే చర్చ జరుగుతోంది.

ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశించిన పలువురు నాయకులు ఆ పదవి దక్కించుకోవడానికి బహిరంగంగా మాట్లాడటమే కాకుండా ఢిల్లీ పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మహిళా నేతలకే ఇవ్వాలని బీజేపీ శిబిరంలో కొన్ని రోజులుగా డిమాండ్ పెరిగింది. బీజేపీ మహిళా నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజేకు కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే ఈలోగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు హైకమాండ్ మాస్టర్ ప్లాన్ వేసిందని, అందుకు తగ్గట్టుగానే కురుబ సామాజికవర్గానికి (కురుబ కులం) చెందిన నాయకుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని బీజేపీ హైకమాండ్ ప్రయత్నిస్తున్నదని ఇప్పుడు చర్చ మొదలైయ్యింది. కర్ణాటకలో 20కి పైగా లోక్ సభ నియోజక వర్గాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ, 20కి పైగా ఎక్కువ లోక్ సభ నియోజక వర్గాల్లో గెలుపొందాలని బీజేపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.
కురుబ సామాజికవర్గానికి నాయకుడిగా, కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య మీద ప్రతీకారం తీర్చుకోవడానికి అదే కులానికి చెందిన నాయకుడిని ఉన్నత పదవి ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందని తెలిసింది. కురుబ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పకు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.

కర్ణాటక బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కేఎస్ ఈశ్వరప్ప కైవసం చేసుకోవడం ఖాయమని బీజేపీలోని కొందరు నాయకులు అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కేఎస్ ఈశ్వరప్ప సమావేశమై చర్చలు జరిపినట్లు సమాచారం. మొత్తం మీద కురుబ కులస్తుల ఓట్లు చీల్చడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారని వెలుగు చూడటంతో ఆ కులానికి చెందిన నాయకులు ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
-
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..!












Click it and Unblock the Notifications