చిరంజీవి లక్కీ హీరోయిన్ కు మైండ్ బ్లాక్, ఊహించని దెబ్బకొట్టిన మోదీ టీమ్, మూడు సీట్లు గోవిందా !
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల రెండో జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఇందులో కర్ణాటకలోని 20 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. మిగిలిన 8 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాలు జేడీఎస్‌కి ఇవ్వనుండగా, మిగిలిన 5 లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు కథ మొదలైయ్యింది.
కోలారు, మండ్య, హాసన్ లోక్ సభ నియోజకవర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు పోటీ చేస్తారని కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ కుమారస్వామి చెప్పడంతో మండ్య ఎంపీ సుమలతకు టెన్షన్ పెరిగిపోయింది. మండ్య సిట్టింగ్ ఎంపీ సుమలత ఈసారి బీజేపీ నుంచి పోటీ చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా బీజేపీలో చేరనప్పటికీ సుమలత బీజేపీకి మద్దతు ప్రకటించారు. అయితే జేడీఎస్, బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో సుమలతకు పెద్ద తలనొప్పి వచ్చింది.

గత లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా సుమలత పోటీ చేశారు. గత లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామిని చిత్తుచిత్తుగా ఓడించిన సుమలత మండ్యలో ఎంపీగా గెలిచారు. సుమలతకు 7,03,660 ఓట్లు రాగా, నిఖిల్ కుమారస్వామికి 5,77,784 ఓట్లు వచ్చాయి. 1,25,876 ఓట్ల తేడాతో గెలిచిన సుమలత ఆ తర్వాత బీజేపీకి మద్దతు ప్రకటించారు. మాజీ ప్రధాని మనుమడిగా, మాజీ సీఎం కుమారుడిగా నిఖిల్ కుమారస్వామి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోవడంతో జేడీఎస్ నాయకులు హడలిపోయారు
కాంగ్రెస్, జేడీఎస్ పొత్తులో భాగంగా నిఖిల్ కుమారస్వామి మండ్యలో ఎంపీగా పోటీ చేసిన ఓడిపోవడంతో జేడీఎస్ దళపతులు అప్పటి నుంచి సుమలత మీద గుర్రుగా ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చేదును జేడీఎస్ ఇప్పటికీ మరిచిపోలేదు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ మండ్య లోక్ సభ నియోజకవర్గం కోసం జేడీఎస్ పట్టుబట్టడం, బీజేపీ నేతలు కూడా అందుకు అంగీకరించడంతో సుమలతకు ఎదురుదెబ్బ తగిలింది.

సుమలతకు మండ్య లోక్ సభ టిక్కెట్ రాకపోయినా బెంగళూరు నార్త్ లేదా మైసూర్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు మైసూరు, బెంగళూరు నార్త్ లోక్ సభ నియోజక వర్గాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించడంతో సుమలతకు టిక్కెట్టు దక్కకపోవడం దాదాపు ఖాయం అయ్యింది. ఏ కారణంతో కూడా తాను మండ్య ఎంపీ సీటు వదులుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన సుమలత మరోసారి పార్టీయేతర అభ్యర్థిగా పోటీ చేయడం తప్ప వేరే చాన్స్ లేదు
అయితే గతసారి లాగా సుమలత మండ్య పార్టీయేతర అభ్యర్థిగా గెలవడం అంత సులువు కాదు. కాంగ్రెస్ తరపున స్టార్ చంద్రు పోటీ చేయనుండగా, జేడీఎస్ తన అభ్యర్థి పేరును ఇంకా ప్రకటించలేదు. మండ్య లోక్‌సభ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒకరు కర్ణాటక సర్వోదయ పార్టీ ఎమ్మెల్యే, మరొకరు జేడీఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. మండ్య లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌పై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత సుమలత తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications