ఎమ్మెల్యేల కొనుగోలు..?: కాంగ్రెస్ నేతలతో బీజేపీ సంప్రదింపులు, ఆధారాలు ఉన్నాయి: అశోక్ గెహ్లట్..
రాజస్తాన్ రాజకీయాలు క్షణ క్షణం మారుతున్నాయి. సచిన్ పైలట్ తిరుగుబాటు ఎగరేయడంతో.. విపక్ష బీజేపీ చిన్న, చితక పార్టీలు.. స్వతంత్రులతో సంప్రదింపులు జరుపుతోంది. అసెంబ్లీలో బలం లేదని, నిరూపించుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. పనిలో పనిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. దీనిపై రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కామెంట్ చేయడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజస్తాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉన్నాయి. 102 సీట్లు మెజార్టీ మార్క్ కాగా.. కాంగ్రెస్ 100 మంది సీట్లు గెలుచుకొని.. బీటీపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీకి 73 సీట్లు గెలువగా.. సచిన్ పైలట్‌తో 18 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి బీజేపీ సంప్రదింపులు జరిపినా.. పైలట్ కమలదళంలో చేరేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నం చేస్తోందని సమాచారం పొక్కింది.

తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో బీజేపీ సంప్రదింపులు జరిపిందని గెహ్లట్ పేర్కొన్నారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.15 కోట్లు ఆఫర్ చేసిందని శనివారం కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మరోసారి ఆ వ్యాఖ్యలను రిపీట్ చేశారు. దానికి సంబంధించి తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. అందుకోసమే తమ ఎమ్మెల్యేలను హోటల్లో ఉంచామని తెలిపారు. లేదంటే ఇతర రాష్ట్రాల్లో చేసినట్టు రాజస్తాన్‌లో కూడా అధికారం చేతులు మార్చే ప్రయత్నం చేసేవారు అని తెలిపారు.
Recommended Video
Horse trading was being done in Jaipur, we have the proof. We had to keep people at a hotel for 10 days, if we had not done that, the same thing that is happening in Manesar now would have happened back then: Ashok Gehlot, Rajasthan Chief Minister pic.twitter.com/tFQT0GVqpj
— ANI (@ANI) July 15, 2020
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తెలంగాణ డిస్కంలకు సింగరేణి ఊహించని షాక్.. రాజస్థాన్ కు కరెంట్ విక్రయం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications