కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు, బీజేపీ నాయకుల మనోవేదన, కౌంటర్ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక గ్యారెంటీలు, హామీలు ఇచ్చి అడ్డదారిలో అధికారంలోకి వచ్చిందని, వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని అమలు చెయ్యాలని కర్ణాటకలోని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మీ అవినీతి తట్టుకోలేక మిమ్మల్ని ప్రజలు ఇంటికి పంపించేశారని, మీరు చికిత్స చేసుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బీజేపీ కర్ణాటక శాఖ గురువారం ట్వీట్ చేసింది. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారెంటీలు వెంటనే అమలు చెయ్యాలని, లేదంటే ప్రజలు తిరగబడే పరిస్థితి ఎదురౌతుందని బీజేపీ ట్వీట్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారం, మంత్రి పదవుల కోసం ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారని, ముందు కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ నాయకుల విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ నాయకులు మనోవేదనతో బాధపడుతున్నారని, ఆసుపత్రికిలో చికిత్స చేసుకుని వారు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది.

కాంగ్రెస్ పార్టీ కన్నడిగులకు ఇచ్చిన గ్యాంరెటీలు మేము గ్యారెంటీగా తీరుస్తామని, అందులో ఎలాంటి డౌట్ లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. బీజేపీ నాయకుల ఇచ్చే తప్పుడు ప్రకటనలు మేము ఇవ్వడంలేదని, మేము ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని, అందులో ఎలాంటి అనుమానం లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేరవేర్చపోతే కర్ణాటక మొత్తం ఆందోళన చేస్తామని బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications