ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ: 10.5 కోట్లకు చేరిన సభ్యులు (ఫోటోలు)
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించింది. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు.
సభ్యత్వాల విషయంలో చైనా కమ్యూనిస్టు పార్టీని తాము అధిగమించామని అన్నారు. బీజేపీలో సభ్యుల సంఖ్య 10.5 కోట్లకు చేరుకున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. బీజేపీ పార్టీ కార్యకర్తల వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొచ్చారు.
ఉత్తర ప్రదేశ్‌లో అత్యధికంగా 1.82 కోట్ల మంది పార్టీలో చేరారని పేర్కొన్నారు. గత నవంబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదగా ప్రారంభించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం అర్ధరాత్రితో ముగిసిందన్నారు. మే 1వ తేదీ నుంచి కొత్త సభ్యులను సంప్రదించే కార్యక్రమాలను చేపడతామన్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ
అంతక ముందు ప్రపంచంలో అత్యధికంగా చైనా కమ్యూనిస్టు పార్టీలో 8 కోట్ల 60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ దీనిని అధిగమంచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఒక్క ఫోన్ కాల్‌తో సభ్యులుగా చేరే హైటెక్ విధానాన్ని బీజేపీ ప్రవేశపెట్టింది.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ
రాబోయే మూడు నెలల్లో సుమారు 15 లక్షల మంది కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఇక పిరికివారైన రైతులే ఆత్మహత్యలు చేసుకుంటారని హర్యానా వ్యవసాయ మంత్రి ఓపీ ధన్‌కర్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ
పార్టీ నేతలు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇక బీహార్ ఎన్నికల పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా బీజేపీ
బీహార్ ఎన్నికల్లో ఎన్‌డీఏలో లేని భాగస్వామ్య పక్షాల కూటమిపై ఇంకా నిర్ణం తీసుకోలేదని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో భూసేకరణ బిల్లుతో పాటు జీఎస్‌టీ బిల్లు తప్పక ఆమోదం పొందుతుందని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications