Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీఎస్పీ ఎంపీపై అనుచిత వ్యాఖ్యల ఎఫెక్ట్: ఎంపీ రమేష్ బిధూరీకి బీజేపీ నోటీసులు

న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన క్రమంలో.. లోక్‌సభ ఎంపీ రమేష్ బిధూరి(Ramesh Bidhuri)కి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతకుముందు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. ఈ ప్రవర్తన పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీని హెచ్చరించారు.

లోక్‌సభలో భారత చంద్రుని మిషన్ చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీపై బిధూరి అనుచిత, మతపరమైన వ్యాఖ్యలను ఉపయోగించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. సభ నుంచి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. కాగా, రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలను రికార్డ్ నుంచి తొలగించారు.

BJP Issues Show Cause Notice To MP Ramesh Bidhuri Over Abusive Remarks Against BSP MP Danish Ali

డానిష్ అలీ గురించి బిధూరీ చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, ఇలాంటి పదజాలం ఇంతకుముందెన్నడూ వినలేదని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అన్నారు. పార్లమెంట్ కొత్త భవనం ఇలాంటి మాటలతో ప్రారంభం కావడం బాధాకరమన్నారు. బిధూరీ వ్యాఖ్యలు బీజేపీ ఉద్దేశాన్ని తెలియజేస్తోందని ఆరోపించారు. బిధూరీపై కఠిన చర్యలు తీసుకోవాలని జైరాం రమేష్ డిమాండ్ చేశారు. ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా బిధూరీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

కాగా, ఎంపీ బిధూరీ వ్యాఖ్యల పట్ల లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యాఖ్యల పట్ల రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. మరోవైపు, తనపై చేసిన వ్యాఖ్యలను ప్రివిలేజ్ కమిటీ పరిశీలనకు పంపాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు డానిష్ అలీ లేఖ రాశారు. బిధూరీపై చర్యలు తీసుకోకుంటూ తాను సభ్యత్వాన్ని వదులుకునే ఆలోచన కూడా చేస్తానని అన్నారు.

మరోవైపు, నోటీసులు జారీ చేసిన బీజేపీ.. సమాధానం ఇవ్వడానికి దక్షిణ ఢిల్లీ ఎంపీ బిధూరీకి 15 రోజుల సమయం ఇచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు ఈ నోటీసులు జారీ చేసినట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+