సిద్దూ సార్ కావేరీ జలాలు వదలద్దు: అఖిలపక్షం
బెంగళూరు: కావేరీ జలాలు తమిళనాడుకు విడుదల చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో కర్ణాటక ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి పలు పార్టీల నాయకుల అభిప్రాయాలు సేకరించింది.
బుధవారం విదాన సౌధలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి బీ.ఎస్. యడ్యూరప్ప, కేంద్ర మంత్రి డి. సదానంద గౌడ, కేఎస్. ఈశ్వరప్ప, ప్రతాప్ సింహా తదితరులు హాజరైనారు.
జేడీఎస్ నుంచి పలువురు నాయకులు హాజరైనారు. ఈ సందర్బంలో జేడీఎస్ నాయకులు మాట్లాడుతూ గురువారం కేంద్ర ప్రభుత్వంతో సమావేశం అయ్యే వరకు తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యరాదని సీఎం సిద్దరామయ్యకు సలహా ఇచ్చారు.

ప్రతిపక్ష నాయకుడు కేఎస్. ఈశ్వరప్ప (బీజేపీ) మాట్లాడుతూ మనం ప్రజల ప్రాణాలు రక్షించడానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సిద్దరామయ్యకు చెప్పారు. ఎటువంటి పరిస్థతిలో తమిళనాడుకు కావేరీ నీరు విడుదల చెయ్యరాదని ఆయన డిమాండ్ చేశారు.
తమిళనాడుకు మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీరు విడుదల చెయ్యాలని మంగళవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. బుధవారం మద్యాహ్నం 2 గంటలకు జరిగే మంత్రి వర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం సిద్దరామయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications