బీజేపీ జైత్రయాత్ర - యూపీతో సహా మూడు రాష్ట్రాల్లో : పంజాబ్ లో ఆప్ దూకుడు..!!
సార్వత్రిక ఎన్నికల ముందు సెమీ ఫైనల్స్ గా భావించిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ దూకుడు కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే ఫలితాల సరళి కనిపిస్తోంది. ప్రధానంగా యూపిలో బీజేపీ అధికారం నిలబెట్టుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా బీజేపీ ఆధిక్యతలో ఉంది. ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న సమాజ్ వాడీ పార్టీలో 106 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 207 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, కాంగ్రెస్ తో పాటుగా బీఎస్పీ పైతం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video
ఇక, అంచనా వేసినట్లుగా పంజాబ్ లో ఆప్ మిగిలిన పార్టీలను ఊడ్చేస్తోంది. అక్కడ అత్యధిక స్థానాల్లో లీడ్ లో నిలిచింది. తాజా సమాచారం మేరకు ఆప్ మేజిక్ ఫిగర్ దాటి 66 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. ప్రధాన ప్రత్యర్ధిగా కాంగ్రెస్ నిలిచింది. సీఎం చన్నీ పోటీ చేసిన రెండు స్థానాల్లో వెనకంజలో ఉన్నారు. ఇక.. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ - బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుుతున్నాయి. అక్కడ రెండు పార్టీలు 34 -34 సీట్లతో బరిలో పోటీ లో ఉన్నాయి. మణిపూర్ ల బీజేపీ 22 స్థానాల్లో.. కాంగ్రెస్ 14 స్థానాల్లో ఆధిక్యతో ఉంది. అయితే, ఇక్కడ ప్రాంతీయ పార్టీ ఎన్పీపీ 13 స్థానాలతో కీలకంగా మారుతోంది. ఇతరులు 11 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు.

తుది ఫలితాల సమయానికి ఇక్కడ ఈ పార్టీ కింగ్ మేకర్ గా మారే అవకాశం కనిపిస్తోంది. కీలకంగా ..ప్రతిష్ఠాత్మకంగా మారిన గోవాలో బీజేపీ 18, కాంగ్రెస్ 16, ఇతరులు ఆరు స్థానాల్లో లీడ్ లో ఉన్నాయి. 40 స్థానాలు ఉన్న గోవాలో 21 స్థానాలు దక్కించుకుంటే అధికారం కైవసం అవుతుంది. అయితే, ఇక్కడ ఇప్పుడున్న ట్రెండ్స్ చూస్తే..తుది ఫలితాలు వెల్లడయ్యే సమయానికి ప్రాంతీయ పార్టీ కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అన్నింటికంటే బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన ఉత్తర ప్రదేశ్ లో మాత్రం స్పష్టమైన మెజార్టీ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. మధ్నాహ్నానికి యూపీ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల తుది ఫలితాల పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications