ఆర్ టీఐ ఎఫెక్ట్, కోట్ల భూమి కబ్జాతో డీల్, హత్యకు సుపారి, ఐటీ హబ్ లో బీజేపీ లీడర్ అందర్ !
కర్ణాటకలో ఆర్ టీఐ కార్యకర్తలకు ఏమాత్రం కొదవలేదు. ఐటీ హబ్ బెంగళూరులో కూడా చాలా మంది ఆర్ టీఐ కార్యకర్తలు ఉన్నారు. సీఎంలు, మాజీ సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేల అక్రమాస్తుల గురించి సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించిన కొందరు ఆర్ టీఐ కార్యకర్తలు చివరికి వారి మీద కోర్టుల్లో కేసులు వేసి హైలెట్ అయ్యారు. కొందరు మాత్రం ఆర్ టీఐ కార్యకర్తల ముసుగులో సెటిల్ మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
బెంగళూరులో నివాసం ఉంటున్న నాగరాజ్ అనే వ్యక్తి ఆర్ టీఐ కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆర్టీఐ కార్యకర్త నాగరాజ్ బెంగళూరులోని కుంబాలగూడ నివాసం ఉంటున్నాడు. కెంగేరి అండర్ పాస్ సమీపంలో బైక్‌పై వెళ్తుండగా దుండగులు అతనిపై మారణాయుధాలతో దాడి చేసి హత్య చెయ్యడానికి ప్రయత్నించారు. అయితే తప్పించుకుని ఆసుపత్రిలో చేరిన ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ప్రాణాలు కాపాడుకున్నాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెంగళూరులోని కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసి బీజేపీ నేత గోవిందరాజు, మనీష్, మోహన్, పూజారి, బెంగళూరు రౌడీషీటర్ కృష్ణ, వేణుగోపాల్, సతీష్, శశికుమార్ రెడ్డిలను అరెస్ట్ చేశారు. కుంబాలగూడ పంచాయతీలో 1. 5 ఎకరాల భూమిని బీజేపీ నాయకుడు గోవిందరాజు కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ కు ఈ విషయం తెలిసింది.
ఆ భూమి గురించి సమాచారం ఇవ్వాలని ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ఆర్టీఐ ద్వారా భూమి వివరాల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోవిందరాజు ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ కు ఫోన్ చేసి సెటిల్ మెంట్ కు రావాలని, ఇద్దరూ కుర్చుని మాట్లాడుకుందామని చెప్పాడని తెలిసింది. కానీ ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ సెటిల్ మెంట్ కు అంగీకరించలేదని, గోవింరాజు దగ్గరకు వెళ్లలేదని తెలిసింది.
ఇదంతా జరిగిన తర్వాత చంద్ర లేఅవుట్ లో నివాసం ఉంటున్న రౌడీషీటర్ కృష్ణకు ఐదు లక్షలు ఇచ్చిన బీజేపీ నాయకుడు గోవిందరాజు ఆర్ టీఐ కార్యకర్త నాగరాజ్ ను హత్య చెయ్యడానికి డీల్ మాట్లాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాగరాజ్ హత్య కోసం రూ. 50 వేలు అడ్వాన్స్ కూడా రౌడీషీటర్ కృష్ణకు ఇచ్చారని పోలీసులు అంటున్నారు. మూడు, నాలుగు రోజులుగా నాగరాజ్ ను హత్య చెయ్యడానికి నిందితులు ప్రయత్నించారని తెలిసింది.

అయితే చివరిగా నాగరాజ్ బైక్ పై వెళుతుండగా కెంగేరి రైల్వే అండర్ పాస్ దగ్గర దాడికి పాల్పడి అతన్ని హత్య చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. కెంగేరి పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఆర్ టీఐ కార్యకర్త హత్య కోసం బీజేపీ నాయకుడు రౌడీషీటర్ కు కిరాయి ఇచ్చి అరెస్టు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
-
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ?












Click it and Unblock the Notifications