Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CM: స్థాయి మరిచిపోయి సీఎంతో పెట్టుకున్నాడు. దెబ్బకు ఖేల్ కతం, ఫేస్ బుక్ ఎఫెక్ట్ !

చెన్నై/కన్యాకుమారి: అధికారంలో ఉన్న నాయకులతో పెట్టుకుంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అధికారంలో ఉన్న నాయకులు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి ప్రత్యర్థుల మీద పగ తీర్చుకోవడం మనం ప్రతిరోజు చూస్తున్నాము. అయితే అధికార పార్టీ నాయకులతో కాకుండా ఓ వ్యక్తి ఏకంగా సీఎంతో పెట్టుకున్నాడు. సీఎంతో ఢీకొట్టిన వ్యక్తి వార్డు కౌన్సిలర్ కావడంతో అక్కడ కథ అడ్డం తిరిగింది. ఓ కౌన్సిలర్ అతని స్థాయి మరిచిపోయి సీఎంను చీప్ గా మాట్లాడితే ఇలాగే ఉంటుందని అధికార పార్టీ నాయకులు అంటున్నారు.

 సీఎం స్టాలిన్ మీద ఆరోపణలు

సీఎం స్టాలిన్ మీద ఆరోపణలు

తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా దక్షిణ తామరైకులం ప్రాంతంలో సుభాష్ స్వయంబు అలియాస్ సుభాష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కన్యాకుమారి జిల్లా బీజేపీ ఐటీ విభాగం ఉపాధ్యక్షుడిగా సుభాష్ పని చేస్తున్నాడు. సుభాష్ జిల్లా నాయకుడు మాత్రమే కాదు దక్షిణ తామరై కుళం మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్ గా విజయం సాధించాడు. రెండు రోజుల క్రితం సుభాష్ అతన ఫేస్‌బుక్ పేజీలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ను చులకన చేస్తూ సోషల్ మీడదియాలో దుష్ప్రచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి.

 సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

తమిళనాడు సీఎం స్టాలిన్ ను సుభాష్ కించపరుచుతూ సోష్ మీడియాలో ప్రచారం చెయ్యడంతో డీఎంకే పార్టీ నాయకులు మండిపడుతున్నారు. డీఎంకే పార్టీకి చెందిన లాయర్ శివ కోటేశ్వరన్ కన్యాకుమారి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. లాయర్ ఫిర్యాదులో కన్యాకుమారి జిల్లా తెంతమరైకులం మునిసిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ సుభాష్ స్వయంబు రెండు వర్గాల మధ్య అల్లర్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడని, సంఘంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు.

 సీఎంతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

సీఎంతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది

సోషల్ మీడియాలో సీఎం స్టాలిన్ మీద దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నాయకుడు సుభాష్ మీద చర్యలు తీసుకోవాలని లాయర్ కోటేశ్వరన్ పోలీసులకు మనవి చేశాడు. లాయర్ ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై దుష్ప్రచారం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నాయకుడు సుభాష్ స్వయంబు అలియాస్ సుభాష్ మీద ఐదు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి జైలులో పెట్టడం కన్యాకుమారి జిల్లాతో పాటు తమిళనాడులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+