వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రమంత్రి పదవీ, నగదు ఆఫర్: బీజేపీ నేత కాంటాక్ట్ అయ్యారు.. ఆప్ ఎంపీ సంచలనం

|
Google Oneindia TeluguNews

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెండ్, ఎంపీ భగవంత్ మాన్ హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరితే డబ్బు, కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవీ ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత ఆఫర్ చేశారని భగవంత్ మాన్ తెలిపారు.

నగదు, మంత్రి పదవీ ఆఫర్

నగదు, మంత్రి పదవీ ఆఫర్

పంజాబ్‌లో భగవంత్ మాన్ ఏకైక ఆప్ ఎంపీ.. నాలుగు రోజుల క్రితం సీనియర్ బీజేపీ నేత నన్ను కాంటాక్ట్ అయ్యారని తెలిపారు. మాన్ సాబ్ బీజేపీలో చేరడానికి మీరు ఏం తీసుకుంటారు? అని నన్ను అడిగారని చెప్పారు. మీకు డబ్బులు కావాలన్నా ఇస్తాం..పార్టీలో చేరితే కేంద్రంలో మంత్రి పదవి ఇస్తాం అని బీజేపీ నేత నాకు ఆఫర్ చేశారు. తనను డబ్బు లేదా ఇంకేదైనా దానితో కొనలేరు అని ఆ బీజేపీ నేతకు నేను చెప్పాను.ఒక మిషన్ మీద ఉన్నా..కమిషన్ మీద కాదు అని ఆ బీజేపీ నేతకు తెగేసి చెప్పానని భగవత్ మాన్ చెప్పారు.

టైం వచ్చిన సమయంలో

టైం వచ్చిన సమయంలో

బీజేపీ నేత ఎవ్వరు అన్న ప్రశ్నకు సమయంలో వచ్చినప్పుడు ఆయన పేరు వెల్లడిస్తా అని భగవత్ మాన్ సమాధానం ఇచ్చారు. పంజాబ్‌లో బీజేపీకి స్థానం లేదన్నారు. గ్రామల్లోకి బీజేపీ నేతలు వెళ్లలేకపోతున్నారని, బీజేపీ నేతలు రైతుల నిరసనను ఎదుర్కొంటున్నారని అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ భావిస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరుస పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు.

Recommended Video

IPL 2022 Retention : It's His Choice - Anil Kumble || Oneindia Telugu
ఆప్ వర్సెస్ కాంగ్రెస్

ఆప్ వర్సెస్ కాంగ్రెస్

వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి అధికారంలో చేపట్టాలని ఆప్ భావిస్తోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ వరసగా పంజాబ్ పర్యటనలు చేస్తూ అక్కడి పార్టీ కేడర్‌లో జోష్ నింపుతున్నారు. పంజాబ్ ఓటర్లను ఆకట్టుకునేలా ముందుకు సాగుతున్నారు. అయితే కేజ్రీవాల్ బలపడితే తమకు నష్టం తప్పదని భావిస్తున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో అధికారాన్ని ఎట్టిపరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. ఆమ్ ఆద్మీ వైపుకి ఓటర్లు మళ్లకుండా చూసే ప్రయత్నాలను కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం నివాసం వద్ద ఢిల్లీ గెస్ట్ టీచర్లు చేసిన నిరసనలో సిద్ధూ పాల్గొన్న సంగతి తెలిసిందే.

English summary
Punjab Aam Aadmi Party president Bhagwant Mann on Sunday claimed a senior BJP leader offered him money and a place in the Union Cabinet to join their party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X