Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సపోజ్ పర్ సపోజ్ అదే జరిగితే మా దగ్గర ప్లాన్ బి రెఢీగా ఉంది, బీజేపీ లీడర్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. మే 13వ తేదీన ఉదయం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. అయితే మాకు సంపూర్ణ మెజారిటీ రాకపోతే మేము ఏం చెయ్యాలో మాకు తెలుసని, మా దగ్గర ప్లాన్ బీ రెఢీగా ఉందని బీజేపీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కలకలం రేపింది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిపోవడంతో సుమారు 100 మంది నాయకులు గెలుపు ధీమాతో రిల్యాక్స్ గా ఉన్నారు. మిగిలిన నాయకులు ఎవరు గెలుస్తారో తెలీక అయోమయంలో టెన్షన్ టెన్షన్ గా ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల జాతకాలు తారుమారు అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

BJP leader R Ashok said that plan B is ready

దాదాపు అన్ని సర్వేలు ఈసారి అధిక సీట్లతో కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పాయి. అయితే ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని పలు సర్వేలు చెప్పాయి. తాము 141 సీట్లలో విజయం సాధిస్తామి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్, 130 సీట్లలో విజయం సాధిస్తామని మాజీ సీఎం సిద్దరామయ్య ధీమాగా చెబుతున్నారు.

కర్ణాటక సీనియర్ మంత్రి, బీజేపీ నాయకుడు ఆర్. అశోక్ మేము కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, వరుసగా రెండోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నమ్మడంలేదని, 2018లో విడుదల అయిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ తారుమారు అయ్యాయని మంత్రి అశోక్ గుర్తు చేశారు.

BJP leader R Ashok said that plan B is ready

ఇంతకాలం వచ్చిన సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తరువాత తారుమారు అవుతాయని బీజేపీ సీనియర్ నాయకుడు అశోక్ జోస్యం చెప్పారు. ఒకవేళ బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రాలేపోయినా మేము ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడానికి మా దగ్గర ప్లాన్ బి రెఢీగా ఉందని మంత్రి అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బెంగళూరులోని పధ్మనాభనగర్ తో పాటు కనకపురలో కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ మీద ఆర్. అశోక్ పోటీ చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చెయ్యకుండా చూస్తూ కర్చోవడానికి మేము రాజకీయ సన్యాసులు కాదని, ఎవరి స్కెచ్ లు వాళ్ల దగ్గర ఉంటాయని, మా దగ్గర ప్లాన్ బి రెఢీగా ఉందని ఆయన మీడియా ముందు చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.

కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు స్ట్రాంగ్ రూమ్ ల్లోని ఈవీఎంల్లో భద్రంగా ఉన్నాయి. మే 13వ తేదీన ఎన్నికల కౌంటింగ్ పూర్తి అయిన తరువాత అందరి బండారం బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో స్కెచ్ లు వేసుకుంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+