తెలంగాణ మాజీ గవర్నర్ హంగామా మామూలుగా లేదుగా..!!
Devendra Fadnavis: మరాఠా గడ్డపై మరోసారి భారతీయ జనతా పార్టీ పాగా వేసినట్టే. శివసేన (ఏక్‌నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అందుకుంది మహాయుటి. 222 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఆధిక్యతలో ఉన్నారు. ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. వంద సీట్లు కూడా ఆ పార్టీకి దక్కేలా కనిపించట్లేదు.

దాదాపుగా ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు. ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ మహాయుటి దూకుడు కొనసాగింది. కొప్రి- పఛ్‌పకడీలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, నాగ్‌పూర్ సౌత్ వెస్ట్, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
శరద్ పవార్ వంటి సీనియర్ నాయకుడు సారథ్యాన్ని వహిస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయింది. ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు చెందిన చీలిక వర్గ ఎన్సీపీకే ఓటర్లు పట్టం కడుతున్నారు. ఆ పార్టీ అభ్యర్థులనే మెజారిటీ స్థానాల్లో గెలిపిస్తోన్నారు.
ముంబై, థానె, పుణే, నాసిక్, రత్నగిరి, షోలాపూర్, నాందెడ్ సహా పలు నగరాలు, జిల్లా కేంద్రాల్లో గల బీజేపీ, శివసేన (షిండే వర్గం), అజిత్ వర్గ ఎన్సీపీ కార్యాలయాల వద్ద ఉత్సవాలు జోరందుకున్నాయి. ఆయా పార్టీల అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటోన్నారు. బాణాసంచా కాల్చుతున్నారు. స్వీట్లను పంచిపెడుతున్నారు.
VIDEO | Maharashtra Assembly Election Results 2024: "Maharashtra is a strong state. People from different parts of India live here, so the verdict in Maharashtra reflects the sentiment of the entire nation. A double-engine government will benefit the people. The alliance… pic.twitter.com/b7O60WS7H6
— Press Trust of India (@PTI_News) November 23, 2024
అటు చెన్నైలోనూ బీజేపీ నాయకుల సంబరాలు మిన్నంటుతున్నాయి. చెన్నై త్యాగరాయ నగర్ వైద్యరామ్ మార్గంలో గల పార్టీ కేంద్ర కార్యాలయం ముందు భారీ ఎత్తున ఉత్సవాలు జరుపుకొంటోన్నారు బీజేపీ నాయకులు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటోన్నారు.
పార్టీ సీనియర్ నాయకురాలు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వయంగా బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. భారత్ మాతా కీ జై, మోదీ నాయకత్వం వర్ధిల్లాలి.. అంటూ నినదించారు. దేశ రాజకీయాల్లో మోదీ, బీజేపీకి ఎదురు లేదని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయని వ్యాఖ్యానించారు. భారతావని ఆయనకు పట్టం కట్టిందని పేర్కొన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications