సుమలత తీరుతో విసిగిపోతున్న బీజేపీ లీడర్స్, మోదీకి చెప్పాలని డిసైడ్ అయ్యారా ?, సీటు మాత్రం !
లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి మండ్య టికెట్ ఎవరికి? అని భారతదేశం మొత్తం ఎదురుచూస్తోంది. బీజేపీ, జేడీఎస్ పార్టీల పొత్తు వల్ల బీజేపీ బలపరిచిన సిట్టింగ్ ఎంపీ సుమలతకు టికెట్ దక్కుతుందా? అన్నది అనేక ప్రశ్నలకు దారితీస్తోంది. బీజేపీ-జేడీఎస్ కూటమిలో మండ్య ఎంపీ ఎవరు? అనేది ఇంకా ఫైనల్ కాలేదు. అయితే కొందరు జేడీఎస్ నేతలు మాత్రం టిక్కెట్ మాకే అని చెబుతున్నారు.
బీజేపీకి మద్దతు ప్రకటించిన సుమలత మండ్యను వీడేది లేదని పదేపదే తేల్చిచెబుతున్నారు. మండ్యలో టికెట్ దక్కకపోవడంతో సుమలతకు కొత్త తలనొప్పి మొదలైంది. అయితే సుమలత విషయంలో బీజేపీ నేతల అసంతృప్తి రానురాను పెరిగిపోతున్నది. 2019 ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ ఎంపీగా పోటీ చేసిన సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చింది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగకుండానే సుమలతను ఆ పార్టీ కార్యకర్తలు గెలిపించారు.

సచ్చిదానంద సైలెంట్:
2023 అసెంబ్లీ ఎన్నికలల్లో మండ్య జిల్లాలో బీజేపీ పార్టీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా మాజీ కేపీసీసీ సభ్యుడు ఎస్. సచ్చిదానంద సహా చాలా మందిని బీజేపీలోకి తీసుకొచ్చారు. మండ్య ఎంపీ సుమలత సన్నిహితుల్లో సచ్చిదానంద ఒకరు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి మండ్యలో సుమలత 7, 03,660 ఓట్లు సాధించారు, కూటమి అభ్యర్థి నిఖిల్ కుమారస్వామి 5, 77,784 ఓట్లు మాత్రం రాబట్టారు.
ఎంపీగా సుమలత విజయం సాధించడంలో సచ్చిదానంద పాత్ర కూడా చాలా కీలకమైంది. 2022లో బీజేపీలోకి వచ్చిన సచ్చిదానందకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీరంగపట్నంలో టికెట్ లభించింది. 42,306 ఓట్లు సాధించిన సచ్చిదానంద 3వ స్థానంలో నిలిచి ఓడిపోయారు. జేడీఎస్‌కు చెందిన రవీంద్ర శ్రీకంఠయ్య 61,680 ఓట్లు, కాంగ్రెస్‌కు చెందిన రమేష్ బండిసిద్దె గౌడ 72,817 ఓట్లు వచ్చాయి. అయితే సచ్చిదానంద మాత్రం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల అభ్యర్థులకు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో మండ్య ఎంపీ సుమలత బీజేపీ నాయకుడు సచ్చిదానందకు బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడమే ఆయన ఓటమికి కారణం అని బీజేపీ నాయకులు అంటున్నారు. ఇదే విషయంలో సచ్చిదానంద, ఆయన మద్దతుదారులు చాలా కలత చెందారు. నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో సచ్చిదానంద వెంట వెళ్లిన సుమలత ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సరిగా పాల్గొనలేదు. ఈ దెబ్బతో అసెంబ్లీ ఎన్నికల్లో సచ్చిదానంద ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు సుమలత భాజపా నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఈ అసంతృప్తి సుమల్తకు ఎక్కువగా ఎదురుదెబ్బ తగులుతుందని బీజేపీ నాయకులు లెక్క వేస్తున్నారు. మండ్యలో సుమలత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల సమయంలో ఉన్నంత పాపులర్ గా ఇప్పుడు లేరని వెలుగు చూసింది. సుమలతకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిలబడితే ఎన్నికల ముఖచిత్రం మారిపోతుంది. సచ్చిదానంద నటుడు దర్శన్‌కి అత్యంత సన్నిహితుడు.
మండ్యలో దర్శన్ కోసం చాలా గ్రాండ్ గా డీ 25 కార్యక్రమాన్ని నిర్వహించిన సచ్చిదానంద మండ్య లోక్ సభ ఎన్నికల విషయంపై గత వారం సుమలత నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కానీ దర్శన్ మాత్రం సుమలత ఆహ్వానం మేరకే వెళ్లాడు తప్ప స్వప్రయోజనాల కోసం వెళ్లలేదని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. అయితే సుమలత మీద బీజేపీ నాయకుల్లో ఇంతకాలం ఉన్న ఆగ్రహం ఇంకా చల్లారలేదు. సుమలత మొండిపట్టుతో ఆమెకు బీజేపీ నాయకులు దూరం అవుతున్నారని తెలిసింది.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications