దమ్ముంటే ప్రధాని మోదీని ప్రశ్నించండి, దుమ్ము దులుపేసిన సీఎం, కూలి పని చేశారా ?

కేంద్ర ప్రభుత్వం నుంచి కరువు సాయం కోరేందుకు ఢిల్లీ వెళ్లిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఢిల్లీ నుంచి బెంగళూరుకు విలాసవంతమైన చార్టర్డ్ విమానంలో వచ్చారు. కర్ణాటక మంత్రి జమీర్‌ అహ్మద్‌ సిద్ధరామయ్యతో కలిసి విమాన ప్రయాణం వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మంత్రి జమీర్ అహ్మద్ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేయడంతో రాష్ట్ర బీజేపీ నేతలు సీఎం సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు.

కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా విలాసవంతమైన విమానంలో వెళ్లి సీఎం సిద్దరామయ్య ఆనందిస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ కూడా సిద్ధరామయ్యపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. ఇదే విషయమై పలువురు మీడియా ప్రతినిధులు సీఎం సిద్ధరామయ్యను ప్రశ్నించగా ప్రధాని నరేంద్ర మోదీ ఏ విమానాల్లో తిరుగుతారు అని ప్రశ్నించారు.

BJP leaders criticized CM Siddaramaiah for going to Delhi in a special flight and enjoying himself

ఇదే ప్రశ్నను ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి అడగాలని, తనను ప్రశ్నించిన వారికి తాను చెబుతున్నానని బీజేపీ నాయకులకు సీఎం సిద్దరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నేతలకు నైతికత లేదని సీఎం సిద్ధరామయ్య బీజేపీ నేతల విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ కమల ద్వారా సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసిన చరిత్ర బీజేపీ నాయకులకు ఉందని సిద్దరామయ్య విమర్శించారు.

ఆపరేషన్ కమల కోసం వందల కోట్ల రూపాయల డబ్బులు ఎవరు ఇచ్చారని, కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ, ముంబాయి చుట్టు తిప్పడానికి విమానం ఎవరు ఇచ్చారని, వారాల తరబడి విలాసవంతమైన హోటళ్లలో బస చేసి సరదాగా గడిపిన ఎమ్మెల్యేల కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేశారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు.

బీజేపీ నాయకులు కూలీ పనులు చేసి ఆపరేషన్ కమల కోసం ఖర్చు చేశారా ? అని సిద్దరామయ్య నిలదీశారు. కర్ణాటక రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించేందుకు నేను ప్రత్యేక విమానంలో వెళ్లడంపై అభ్యంతరం చెప్పే నైతికత కర్ణాటక రాష్ట్ర బీజేపీ నేతలకు ఉందా?, వాళ్లు సక్రమంగా ఉన్నారా అని సీఎం సిద్దరామయ్య విరుచుకుపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+