యూపీలో బీజేపీ ఆధిక్యత - లీడ్ లో ప్రముఖ నేతలు : యోగీ - అఖిలేష్ ముందంజ..!!
ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యత కొనసాగుతోంది. ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్స్ బీజేపీ ఆధిక్యతను స్పష్టం చేస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగియటంతో అనేక ప్రాంతాల్లో ఈవీఎం ల లెక్కింపు ప్రారంభించారు. బీజేపీ తొలి స్థానంలో ఉన్నా.. ఎస్పీ గట్టి పోటీనే ఇస్తోంది. అయితే, ట్రెండ్స్ చూస్తుంటే ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల మేరకు చూస్తే బీజేపీ 142 స్థానాల్లో, సమాజ్‌వాదీ పార్టీ 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అదే సమయంలో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ 5 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. గోరఖ్ పూర్ అర్బన్ నుంచి తొలి సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాద్ ముందంజలో ఉన్నారు. అదే విధంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ తన నియోజకవర్గం కర్హాల్ లో తొలి స్థానంలో కొనసాగుతున్నారు. భాగ్‌పత్ నుంచి బీజేపీ అభ్యర్థి యోగేష్ ధామా, బరౌత్ స్థానం నుంచి కృష్ణపాల్ మాలిక్ ఆధిక్యంలో ఉన్నారు. అవధ్‌లో బీజేపీ 118 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బుందేల్‌ఖండ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉంది.

Recommended Video
అదే సమయంలో పశ్చిమ యూపీలో సమాజ్‌వాదీ కంటే బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ బీజేపీ 38, సమాజ్‌వాదీ కూటమి 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. పూర్వాంచల్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజలు గెలుస్తున్నారు, గూండాయిజం ఓడిపోతుందని డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. మరోసారి యూపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. అయితే తుది ఫలితాలు సాయంత్రానికి వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications