కాంగ్రెస్‌కు షాక్: లింగాయత్ ప్రాబల్యం ఉన్న చోట బిజెపి అభ్యర్ధుల ఆధిక్యం
బెంగుళూరు: లింగాయత్‌లకు మైనారిటీ హోదా కాంగ్రెస్ పార్టీకి అంతగా కర్ణాటక ఎన్నికల్లో అంతగా ఉపయోగం లేకుండా పోయిందనిపిస్తోంది. లింగాయత్‌లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో బిజెపి అభ్యర్ధులు ఆధిక్యంలో ఉన్నారు.సంప్రదాయకంగా బిజెపికే లింగాయత్‌లు మద్దతిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి లింగాయత్‌ల ఆదరణ పెద్దగా దక్కలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే లింగాయత్‌లకు మైనార్టీ హోదాను ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. లింగాయత్‌లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా విపక్షాలు ఆరోపణలు చేశాయి.ఈ అంశాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందని విపక్షాలు విమర్శలు గుప్పించాయి.

ఉత్తర కర్ణాటక ప్రాంతంలో లింగాయత్‌ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సుమారు 100 అసెంబ్లీ సెగ్మెంట్లలో లింగాయత్‌లు ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని లింగాయత్‌లను ఆకర్షించేందుకుగాను ఆయా పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేశాయి.
కర్ణాటక రాష్ట్ర జనాభాలో సుమారు 17 శాతం లింగాయత్‌లు ఉంటారు. లింగాయత్‌లు బసవన్నను అనుసరిస్తున్నారు. 12వ, శతాబ్దానికి చెందిన బసవన్న సంఘసంస్కర్తగా పేరుంది. లింగాయత్‌లు ఆయనను ఆరాధిస్తారు.












Click it and Unblock the Notifications