పీఎఫ్ఐ గూండాలను రక్షిస్తున్న ఈ ప్రభుత్వం పోలీసులతో ఆడుకుంటోంది, బీజేపీ!
బెంగళూరు/ శివమొగ్గ: పర్వతాల ముఖద్వారంగా పేరొందిన శివమొగ్గలో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ కారణంగానే పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని సీఎం సిద్దరామయ్య కఠిన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ సందర్భంగా బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంతకీ సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య అనేక విషయాల్లో వాగ్వాదం సర్వసాధారణం అయ్యింది. అయితే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా శివమొగ్గలో పరిస్థితి వీరిద్దరి మధ్య చిచ్చు రేపుతోంది. దీనిపై ట్వీట్ చేసిన బీజేపీ రాష్ట్ర శాఖ కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇంతకీ బీజేపీ ట్వీట్‌లో చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

దీనిపై కర్ణాటక బీజేపీ ఈరోజు ట్వీట్ చేస్తూ శివమొగ్గలో గతంలో విధ్వంసానికి పాల్పడిన పీఎఫ్‌ఐ గూండాలందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిందని, అందుకే పోలీసు అధికారాలపై మతోన్మాదులు రాళ్లు రువ్వినా, పలువురు పోలీసులు గాయపడినా సిద్దరామయ్య ప్రభుత్వం పరువు పోతుందని సైలెంట్ గా ఉందని బీజేపీ ఆరోపించింది.
నీతి నిజాయితీ, సమర్థత, శక్తిమంతులైన మా పోలీసు అధికారుల చేతులు కట్టేసి ఛాందసవాదుల రాగానికి వంగేలా చేసిన మీ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతికత లేదని, వెంటనే సీఎంతో పాటు మంత్ులు రాజీనామా చెయ్యాలని బీజేపీ డిమాండ్ చేసింది. ముస్లీంలు ఆదివారం ఊరేగింపుగా వెలుతున్న సమయంలో ఓ వర్గం వాళ్లు రాళ్లు రువ్వడంతో శివమొగ్గ అట్టుడికిపోతుంది.












Click it and Unblock the Notifications