గుజరాత్ బీజేపీ మేనిఫెస్టో: 20 లక్షల ఉద్యోగాలు, ఉమ్మడి పౌరస్మృతి, ఉచిత విద్య

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది అధికార బీజేపీ. కేజీ టూ పీజీ ఉచిత విద్య, ఉమ్మడి పౌరస్మృతి అమలు వంటి హామీలను అందులో పేర్కొంది. గాంధీనగర్‌లో బీజేపీ జాతీయ కార్యదర్శి జేపీ నడ్డా, గుజరాత్​ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్‌​తో పాటు రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్​ భూపేంద్ర పాటిల్​ ఈ మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు.

ప్రజల వద్ద నుంచి సేకరించిన సలహాలు, సూచనలు దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టోను తయారు చేశామన్నారు బీజేపీ నేతలు. వివిధ జిల్లాల్లో మంత్రులతో పాటు యువమోర్చా ద్వారా పలు కార్యక్రమాల ద్వారా సలహాలు సేకరించినట్లు తెలిపారు. సుమారు 12 వేల సూచనల ​ బాక్సులు, మిస్డ్ కాల్స్ పోల్​, వెబ్‌సైట్ పోల్​, వాట్సాప్ పోల్​ల సమాహారమే ఈ 'సంకల్ప పత్రం' అని జేపీ నడ్డా వెల్లడించారు.

 BJP manifesto for Gujarat: BJP promises 20 lakh jobs, Uniform Civil Code implementation, free education

ఉగ్రముప్పు నుంచి రాష్ట్రానికి భద్రత కల్పించేలా యాంటీ-రాడికలైజేషన్ యూనిట్ ఏర్పాటు, రెండు ఎయిమ్స్ సహా కొత్త ఆస్పత్రుల నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలల పునరుద్ధరణ వంటి హామీలతో ఈ మేనిఫెస్టోను రూపొందించింది.


బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

రూ. 10 వేల కోట్లతో రాష్ట్రంలోని 20 వేల ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి

విద్యార్థినులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య

ఉమ్మడి పౌరస్మృతి అమలు, వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగావకాశాలు

వచ్చే ఐదేళ్లలో మహిళలకు లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు

రూ. 10వేల కోట్లతో రైతులకు మౌలిక సదుపాయాల కల్పన

మహిళలు, వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణాలు

ఆయుష్మాన్ భారత్ కింద వార్షిక బీమా మొత్తం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు పెంపు.

గుజరాత్ ఆర్థిక వ్యవస్థను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు సమానంగా తీర్చిదిద్దడం.

సంఘ విద్రోహకులు ప్రభుత్వ లేదా ప్రైవేట్​ ఆస్తులకు నష్టం చేకూరిస్తే వారిపై చర్యలు తీసుకునేలా చేస్తాం.

ఉగ్రవాదులతో పాటు స్లీపర్​ సెల్స్​ను నిర్మూలించేందుకు యాంటీ రాడికలైజేషన్ సెల్‌ను స్థాపిస్తాం.

కాగా, 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్ 1, 5 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 8.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+