ప్రకాష్ రాజ్ హాజరు: అపవిత్రం అయ్యింది, బీజేపీ కార్యకర్తలు ఏం చేశారంటే, కౌంటర్!
బెంగళూరు: బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ మా ఊరిలో అడుగుపెట్టి ఈ నేలను అపవిత్రం చేశారని కర్ణాటకలోని శిరసి పట్టణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి మా గడ్డ మీద అడుగుపెట్టి పాపం చేశారని, పరిహారం కోసం గోమూత్రంతో శుభ్రం చేశామని బీజేపీ కార్యకర్తలు చెప్పారు.

ప్రకాష్ రాజ్ పర్యటన
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని శిరసి పట్టణంలో ప్రీతి పదగలు (ప్రేమ పదాలు) అనే సంస్థ నమ్మ సంవిధాన నమ్మ హెమ్మే (మా డెమాక్రసీ, మా గొప్ప) అనే కార్యక్రమం ఏర్పాటు చేశారు. బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ ఈ కార్యక్రమానికి హాజరైనారు.

మఠంలో కార్యక్రమం
శిరసి పట్టణంలోని శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రకాష్ రాజ్ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే కి విరుద్దంగా విరుచుకుపడ్డారు. దేశానికి పెద్దరోగం పట్టుకుందని బీజేపీ నాయకులను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ విమర్శించారు.

హిందూ దేవతలు
గోమాంసం ఆరగించాలని, హిందూ దేవతలను అవమానిస్తూ మాట్లాడిన ప్రకాష్ రాజ్ శిరసి పట్టణంలో అడుగు పెట్టి అపవిత్రం చేశారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ లాంటి జాతీ వ్యతిరేక వ్యక్తులను కార్యక్రమానికి ఎందుకు ఆహ్వానించారని నిర్వహకులను ప్రశ్నించారు.

గోమూత్రంతో శుభ్రం
శ్రీ రాఘవేంద్రస్వామి మఠంకు భేటీ అయిన ప్రకాష్ రాజ్ ఇక్కడ అపవిత్రం చేశారని, పరిహారం కోసం ధార్మికకేంద్రం అయిన ఈ వేధిక (స్టేజ్ )ను శుభ్రం చెయ్యాలని బీజేపీ యువమోర్చ నాయకుడు విశాల్ మరాఠ ఆధ్వర్యంలో గోమూత్రంతో శుభ్రం చేశారు.

ప్రకాష్ రాజ్ కౌంటర్
తన కార్యక్రమానికి వేధిక అయిన శ్రీరాఘవేంద్రస్వామి మఠంలోని వేధికను గోమూత్రంతో శుభ్రం చేశారని తెలుసుకున్న ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో స్పంధించారు. దేశంలో తాను ఎక్కడికి వెళ్లి వచ్చినా ఇలాగే శుభ్రం చేస్తారా ? అంటూ ప్రకాష్ రాజ్ బీజేపీ నాయకులను వ్యంగంగా ప్రశ్నించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!











Click it and Unblock the Notifications