భారత్ ను పాకిస్థాన్ చేస్తున్న కాంగ్రెస్, నేను సీఎం అయితే 20 వేల బుల్డోజర్లతో తొక్కిస్తా !
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేదని, తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే ఉగ్రవాదులు, మతోన్మాద సంస్థల ఇళ్లను కూల్చివేసేందుకు 20 వేల బుల్డోజర్లను కొనుగోలు చేస్తానని బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే బసన్‌గౌడ్ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి, బీజేపీ లోక్ సభ అభ్యర్థి ప్రహ్లాద్ జోషిని గెలిపించాలని భారీ రోడ్ షో నిర్వహించిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే బసన్ గౌడ పాటిల్ యత్నాల్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. హుబ్బళిలోని కాలేజ్ అమ్మాయి నేహా హిరేమఠ్ ను హత్యను హోంమంత్రి పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్దరామయ్య చాలా తేలిగ్గా చూశారని, ఆ అమ్మాయి గురించి చాలా చులకనగా మాట్లాడారని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు.

కేవలం ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు భారత్‌ను పాకిస్థాన్‌గా మార్చబోతున్నారని, అదే కారణంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎక్కడ చూసినా పాకిస్థాన్ జెండాలు రెపరెపలాడుతున్నాయని బసవనగౌడ పాటిల్ యత్నాల్ ఆరోపించారు. భారత్‌ను పాకిస్థాన్‌గా మార్చబోతున్న కాంగ్రెస్ పార్టీకి రాబోయే రోజుల్లో ప్రజలు సినిమా చూపిస్తారని, మీరు వేసిన ఒక్క ఓటు కూడా ఉగ్రవాదిని చంపేస్తుందని గుర్తు పెట్టుకుని ఓటు వెయ్యాలని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు.
కాంగ్రెస్ ఎక్కడికెళ్లినా చెంబు కప్పు మోస్తున్నారు. ఎందుకంటే, ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మూడో సారి ప్రధాని కావడం గ్యారెంటీ అని, అదే సమయంలో చెంబు పట్టుకుని బయటకు వెళ్లడం గ్యారెంటీ అని, కాంగ్రెస్ నాయకులు చెంబు పట్టుకుని ఇంటికి వెళ్లడం కూడా గ్యారెంటీ అని బసవనగౌడ పాటిల్ వ్యంగంగా అన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే ప్రయోజనం లేదని, దేశం కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ ఏం చేస్తుందో చెప్పాలని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ అన్నారు.
కాంగ్రెస్ నాయకుల మాయమాటలు పట్టించుకోకుండా ఓటర్లు బీజేపీకి మద్దతు ఇవ్వాలని, సిద్దరామయ్య ప్రభుత్వంలో హిందువులకు రక్షణ లేదని, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని, అయితే ప్రధాని మోదీ 10 ఏళ్ల పాలన దేశ ప్రతిష్టను పెంచడంతో పాటు అభివృద్ధి చెందిన దేశాలు కూడా భారత్ వైపు చూసేలా చేసిందని బసవనగౌడ పాటిల్ యత్నాల్ అన్నారు. కర్ణాటకలో 28 లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని, సిద్దరామయ్య ప్రభుత్వం హిందువులకు రక్షణ కల్పించాలని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాల్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications