బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మెల్యే కూతురు తలపొగరు, పోలీసులపై చిందులు, మీడియాపై కూడా.. చివరికీ సారీ..

|
Google Oneindia TeluguNews

అధికార దర్పంతో కొందరు తల పొగరుతో ఉంటారు. కొంతమంది నేతలు ఉండగా.. మరికొంతమంది వారి పిల్లలు ఉంటున్నారు. వీరితో పోలీసులు/ అధికారులకు పాట్లు తప్పవు. కర్ణాటక ఎమ్మెల్యే కూతురు ఒకరు హల్ చల్ చేశారు. ఆ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేయగా.. ఎమ్మెల్యే దిగి వచ్చారు. సదరు ట్రాఫిక్ పోలీసులకు క్షమాపణ చెప్పారు. జర్నలిస్టులకు కూడా సారీ చెప్పి.. ఇష్యూను సెట్ చేసే యత్నం చేశారు.

 ఎమ్మెల్యే కూతురు ఇలా..

ఎమ్మెల్యే కూతురు ఇలా..


రూల్స్ ఎవరికయినా ఒక్కటే.. రూల్ ఫర్ ఆల్.. నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తామంటే కుదరదు. కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబావళి కుమార్తెను ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. రూల్స్ బ్రేక్ చేసినందున తప్పలేదు. గురువారం బెంగళూరులో బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్‌ జంప్ చేసింది. పోలీసులు ఆమె కారును ఆపివేశారు. సిగ్నల్‌ క్రాస్‌ చేసినందుకు రూ.10 వేలు జరిమానా విధించారు.

 డబ్బులు లేవట

డబ్బులు లేవట


పోలీసులు చెప్పిన మాట విన్న ఆమెకు కోపం వచ్చింది. తన కారునే ఆపుతారా.. తాను ఎమ్మెల్యే లింబావళి కూతురుని అని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. వారి మధ్య మాటల యుద్దం జరిగింది. తన వద్ద డబ్బులు లేవని చెప్పింది. ఏదో అలా చెప్పి ఉంటే ఏమీ అయ్యేది కాదు.. ఇప్పుడు ఫైన్‌ చెల్లించనని మొండికేసింది. దీంతో వారి మధ్య డైలాగ్ వార్ ముగియలేదు.

తిట్ల దండకం..

తిట్ల దండకం..


అంతేకాదు నోటికి పనిచెప్పి తిట్ల దండకం అందుకుంది. ఈ వ్యవహారం అంతా కెమెరాల్లో బంధించేందుకు మీడియా సిబ్బంది ప్రయత్నించారు. వారిని కూడా కూడా ఊరుకోలేదు. వారి పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారు. వీడియో తీయొద్దని బెదిరించింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే అరవింద్‌ తల పట్టుకున్నారు. కూతురు చేసిన పనికి క్షమాపణ చెప్పారు. పోలీసులతోపాటు జర్నలిస్టులకు సారీ చెప్పారు.

సరికాదు..

సరికాదు..


అధికార దర్పం, తల పొగరుతో ఇలా చేయడం ఏంటి అని నెటిజన్లు అంటున్నారు. పోలీసులు, జర్నలిస్టులు అంటే లెక్కలేదా.. ? ఎమ్మెల్యే కూతురుకు నిబంధనలు వర్తించవా అని అడుగుతున్నారు.

English summary
BJP MLA Aravind Limbavali’s daughter created a scene near a hotel on Raj Bhavan Road in Bengaluru.mla said sorry to police and media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X