కర్నాటక ఎన్నికల ప్రచారంలో గుండెనొప్పి: జయానగర్ ఎమ్మెల్యే హఠాన్మరణం
బెంగళూరు: బీజేపీ నాయకులు, జయనగర్ ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ హఠాన్మరణం పొందారు. బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు.
అతను శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు అరవై ఏళ్లు. వారం కిందట చికిత్స పొంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రచారానికి వెళ్లి గుండెనొప్పితో పడిపోయారు.

జయనగర్ నుంచి ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇటీవలే చికిత్స జరగడంతో ప్రచారానికి వెళ్లవద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆయన వినలేదు. హఠాత్తుగా గుండెనొప్పి రావడంతో కిందపడిపోయారు. ఆసుపత్రికి తరలించేలోగా కన్నుమూశారు.












Click it and Unblock the Notifications